పి.వి.ఆర్ పై రామ్ గోపాల్ వర్మ ఫైర్ !!!

వివాదత్మక చిత్రాలకు మారు పేరు ఐన రామ్ గోపాల్ వర్మ ఈ సారి నైనా గంగూలి, అప్సర రాణి లు జంటగా లెస్బియన్ ఛాయలున్న ఒక చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేకుని ధియేటర్ రిలీజ్ కు ముస్తాబవుతుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ పనులలో రామ్గోపాల్ వర్మ బిజీ బిజీగా ఉన్నారు. సెన్సార్ పూర్తి చేస్కున్న ఈ చిత్రానికి మల్టీప్లెక్స్ థియేటర్స్ విషయం లో చుక్కెదురయ్యింది.

- Advertisement -

ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు పి.వి.ఆర్. మరియు ఐనొక్స్ ల పై రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని వెళ్లగక్కారు.

పి.వి.ఆర్. మరియు ఐనొక్స్ లు డేంజరస్ చిత్రాన్ని తమ ధియేటర్ లలో రిలీజ్ చెయ్యడానికి సముఖత చుపియ్యడం లేదు.

ఈ సంస్థలు దేశం లో ఉన్న ఎల్.జి.బి.టి. వారి మనోభావాలు దెబ్బతీసేవిధంగా ప్రవర్తిస్తున్నారని, దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు ఎప్పుడో ఆర్టికల్ 377 ద్వార వారిని కూడా సమానంగా పరిగణించాలని చెప్పినప్పటికీ, ఇలా చెయ్యడం సమంజసం కాదని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు