తెలంగాణ ఎన్నికల కోసం లక్షల రూపాయలను ఖర్చు చేసిన రామ్ చరణ్..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు, రాజకీయ, సినీ ప్రముఖులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓ పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చడం పట్ల రామ్ చరణ్ కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఓటు వేయడం కోసం ఆయన మైసూర్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరారు.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్రమైజ్డ్ గా అంచనాలకు దీటుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ చరణ్ మైసూర్ నుండి రిటన్ వచ్చేశారు.

అయితే ప్రత్యేకంగా ఫ్లైట్ బుక్ చేసిన రామ్ చరణ్ తను, తనతో వర్క్ చేసే మరికొందరిని ఆ ఫ్లైట్ లో హైదరాబాద్ కి తీసుకువచ్చారు. భాగ్యనగరానికి వచ్చేందుకు చరణ్ లక్షల్లో ఖర్చు చేశారట. నేడు ఓటు హక్కును వినియోగించుకొని మళ్లీ అదే ఫ్లైట్ లో తిరిగి మైసూర్ వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు చరణ్. అయితే ఒక్క ఓటు వేయడానికి లక్షల రూపాయలు ఖర్చుపెట్టి వస్తున్న రామ్ చరణ్ కమిట్మెంట్ ని చూసి ఆయన ఫ్యాన్స్ ఔరా అంటున్నారు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు