Rajinikanth About Alcohol : రజినీకాంత్‌నే చెప్పుతో కొడతా అని మాస్ వార్నింగ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్..!

Rajinikanth About Alcohol: సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. బస్ కండక్టర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టిన. ఈయన నాటకాలలో నటించి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.. మొదట్లో విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించిన ఈయన.. ఆ తర్వాత హీరోగా మారి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. యాక్షన్ చిత్రాలతో పాటు మాస్ హీరోగా కూడా పేరు సొంతం చేసుకున్న రజనీకాంత్… డివోషనల్ సినిమాలలో కూడా నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అన్ని పాత్రలలో కూడా నటించి మెప్పించిన ఈయన సౌత్ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకొని.. తన సినిమాలతో భారీ విజయాలను దక్కించుకున్నారు.

ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరో..

ఇక ఇప్పటికీ వరుస సినిమాలు ప్రకటిస్తూ యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలకి కూడా గట్టి పోటీ ఇస్తున్న రజనీకాంత్.. పారితోషకం విషయంలో కూడా ఒక్కో సినిమాకు రూ .170 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. రజనీకాంత్ అంటే ఒక హీరో మాత్రమే కాదు ఎంతోమందికి ఆదర్శం కూడా.. ఆయన సినీ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వారికి సహాయం చేయడంతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి కూడా ఆర్థిక భరోసా ఇస్తూ మరింత ఇమేజ్ దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా సినిమాల పరంగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న సూపర్స్టార్ రజనీకాంత్ ను ఒక డైరెక్టర్ ఏకంగా చెప్పుతో కొడతానని అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారట.. అసలు ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు రజినీకాంత్ ను ఇంత మాట అన్నారు? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి..

రజినీకాంత్ ను చెప్పుతో కొడతానన్న డైరక్టర్..

Rajinikanth About Alcohol : The star director gave a mass warning that Rajinikanth will be hit with a shoe..!
Rajinikanth About Alcohol : The star director gave a mass warning that Rajinikanth will be hit with a shoe..!

ఈ విషయాలపై రజనీకాంత్ మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.. రజనీకాంత్ మాట్లాడుతూ..ఒకరోజు ప్యాకప్ చెప్పగానే మందు తాగాను.. కానీ ప్యాకప్ అవ్వలేదు.. ఇంకొక షాట్ ఉంది.. బాలచందర్ గారు రమ్మంటున్నారు అన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడ్డాను.. కానీ ఆయన కనిపెట్టేశారు. అప్పుడు ఆయన అన్నారు.. నీకు కమెడియన్ నగేష్ తెలుసా ? నటనలో అతని ముందు నువ్వు దుమ్ముతో సమానం, అలాంటి అతను కూడా తాగుడికి బానిసయ్యి తన కెరియర్ ని నాశనం చేసుకున్నాడు. నువ్ ఇంకొక్కసారి తాగినట్టు తెలిస్తే చెప్పుతో కొడతా అని మాస్ వార్నింగ్ ఇచ్చారట బాలచందర్.. ఇక ఆరోజు నుంచి మందు ముట్టుకోలేదు రజినీకాంత్..

- Advertisement -

ఆధ్యాత్మికం వైపు అడుగులు..

ఇక రజినీకాంత్ పూర్తిగా ఆధ్యాత్మికం వైపు అడుగుల వేస్తున్న విషయం తెలిసిందే.. ఆయనకు సినిమాల నుంచి కాస్త విరామం దొరికితే చాలు హిమాలయాలకు వెళ్లి అక్కడ మనశ్శాంతి పొందుతూ ఉంటారు.. అలాగే ఎంతో మంది పీఠాధిపతులను కలుస్తూ ఉంటారు.. రాఘవేంద్ర స్వామిని ఆరాధ్య దైవంగా పూజిస్తున్న రజినీకాంత్ ఎక్కువగా ఆయన మార్గంలోనే అడుగులు వేస్తున్నారు. ఇక ప్రస్తుతం వెట్టయాన్ అనే సినిమాలో నటిస్తున్న రజినీకాంత్ ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. ఇటీవలే జైలర్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు వెట్టయాన్ చిత్రంలో నటిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు