Pushpa The Rule : పుష్ప రాజ్ పునరాగమనం

ఈ మధ్య కాలంలో ఒక సినిమా రెండు పార్టులుగా రావడం చూస్తున్నం. బాహుబలి, కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలన్నీ రెండు పార్ట్ లు గానే వచ్చాయి. అలాగే మరి కొన్ని సినిమాలు మొదటి భాగం బ్లాక్‌బస్టర్ అయితే, ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి సీక్వెల్ తీసుకువస్తున్నారు. ప్రేక్షకులు మొదటి పార్ట్ ను మర్చిపోక ముందే, సీక్వెల్ ను తెరకెక్కిస్తారు. ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు.

అయితే, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా మాత్రం ఇలా రావడం లేదు. గతేడాది డిసెంబర్ 17న పుష్ప పార్ట్ 1 ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఇప్పటికే దాదాపు 7 నెలలు గడుస్తున్న సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఈ నెలలో కూడా షూటింగ్‌ జరిగే సూచనలు కనిపించడం లేదు.

పుష్ప ది రైజ్ అద్భుత విజయం సాధించడంతో, దానికి మించి అవుట్ పుట్ రావాలని దర్శకుడు సుకుమార్ ప్రయత్నిస్తున్నాడట. అందు కోసం ప్రముఖ రచయితలను, దర్శకులను సలహాలను కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది. సెకండ్ ప్టార్ ను కూడా హిందీ ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించాలని సుక్కు ప్లాన్ చేస్తున్నారట. అందు కోసం షూటింగ్ ఆలస్యమైందని తెలుస్తుంది.

- Advertisement -

ఇదిలా ఉండగా, మెగా ఫ్యాన్స్ ఇప్పటి వరకు వెయిట్ చేయించిన సుక్కు, ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడట. ఆగస్ట్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం తొలి షెడ్యూల్‌కి కావాల్సిన ఆర్టిస్టుల డేట్స్‌ వర్క్‌ అవుతున్నాయి. సినిమా టీమ్‌కు అన్నీ అనుకూలించి, షూట్ నిరంతరం కొనసాగితే, పుష్పా ది రూల్ 2023 వేసవిలో విడుదల కావచ్చు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు