Pushpa-2: అప్పుడు మిస్ ఇప్పుడు ప్లస్

విజయ్ సేతుపతి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. తమిళ సినిమాలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి తరువాత నటుడిగా ఎదిగాడు. ఆ తర్వాత హీరోగా అద్భుతమైన సినిమాలు చేసాడు. కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా విలక్షణమైన పాత్రలను చేస్తున్నాడు.

హీరో అంటే సిక్స్ ఫీట్ ఉండాలి, సిక్స్ ప్యాక్ ఉండాలి అని కొందరు భావిస్తారు. హీరో అంటే టాలెంట్ ఉండాలి, మనకు వచ్చే పాత్రలకు న్యాయం చెయ్యాలి అని విజయ్ సేతుపతి భావిస్తాడు. సైరా , ఉప్పెన సినిమాలు తరువాత పుష్ప సినిమాలో విజయ్ సేతుపతికి అవకాశం వచ్చింది. కానీ డేట్స్ కుదరక ఆ పాత్ర కాస్త ఫహద్ ఫాజిల్ కు చేరింది.

ఇప్పుడు పుష్ప – 2 లో ఇంకో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉంటుందని, ఆ పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాలో పాత్ర మిస్ అయినా, ఈ సినిమాలో మంచి పాత్ర పడితే అది సినిమాకి మంచి ప్లస్ అవుతుంది.పుష్ప ఊహించని స్థాయిలో విజయం సాధించిన విషయం విదితమే. అందుకే ప్రస్తుతం పుష్ప-2 సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను నిలబెట్టే దిశగా సుకుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు