Pushpa-2: సీక్వెల్ సిద్ధం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. విడుదల రోజునుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్ సాధించిన పుష్ప చిత్రం ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ముఖ్యంగా పుష్ప చిత్రానికి బాలీవుడ్ నుండి ప్రశంసలు వర్షం కురిసింది.
పుష్ప రాజ్ పాత్రలో బన్నీ నటించిన తీరు చాలామందిని ఆకట్టుకుంది.
పుష్ప లోని డైలాగ్స్ ను రాజకీయ నాయకులు, క్రికెటర్స్ ఇమిటేట్ చేసేంత ప్రభావం చూపించింది.

బన్నీ కెరియర్ లోనే అత్యంత హిట్ గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
పుష్ప సినిమా భారీ హిట్ అవ్వడంతో పుష్ప -2 చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

తాజాగా పుష్ప సీక్వెల్ పూజా కార్యక్రమం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు