ఎట్టకేలకు పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్

పూరి జగన్నాధ్ గన్ నుండి బుల్లెట్స్ బయటకు వచ్చినట్లు ఈయన పెన్ నుండి డైలాగ్స్ బయటకు వస్తాయి. మనుషులను మార్చేలా , కదిలించేలా , కెలికేసేలా రాయడం ఈయనకు పెన్ తో పెట్టిన విద్య. ప్రతి డైరెక్టర్ దగ్గర వాళ్ళు ఎంతో ఇష్టపడి రాసుకునే స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది. అలా పూరి జగన్నాధ్ దగ్గర ఉన్న స్క్రిప్ట్ “జనగణమన” ఈ స్కిప్ట్ ను ఇప్పుడు విజయ దేవర కొండ తో చేస్తున్నట్లు ఆఫీసియల్ గా అనౌన్స్ చేసారు.


ఫాస్ట్ గా స్క్రిప్ట్ రాసి, ఫాస్ట్ గా సినిమా ఫినిష్ చేసే పూరి స్పీడ్ ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది అని చెప్పొచ్చు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత ఇప్పటివరకు పూరి నుంచి ఒక సినిమా రాలేదు. పూరి ప్రస్తుతం విజయ్ తో లైగర్ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పూర్తవ్వకుండానే అదే హీరో తో ఇంకో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు పూరి. అదే ఆయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మూవీ ‘జనగణమన’ (JGM). రౌడీ హీరో విజయ్‌ దేవరకొండతో జగన్‌ తెరకెక్కిస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పుడు జరుగుతున్న లైగర్ మూవీ ఆగస్టు 25, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా పూరీ జగన్నాథ్‌-విజయ్‌ దేవరకొండ క్రేజీ కాంబోగా వస్తోన్న ఈ ‘జనగణమన’ చిత్రం పోస్టర్‌, విడుదల తేదిని ప్రకటించారు. ఈ పోస్టర్‌ లాంచ్‌ ముంబైలో గ్రాండ్‌గా జరిగింది.

ఈ కార్యక్రమానికి విజయ్‌ దేవరకొండ ఆర్మీ డ్రెస్‌లో ప్రత్యేక ఛాపర్‌లో ముంబై చేరుకున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సైనికుడిగా కనిపించనున్నాడు రౌడీ హీరో. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ ‘నేను ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. నేను చూసిన స్క్రిప్ట్‌లలో ఇది చాలా ఛాలెంజింగ్‌ కథ. ఈ సినిమా కథ ప్రతీ భారతీయుడికి హత్తుకుంటుంది. పూరి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎప్పుడూ చేయని పాత్రను జెజీఎంలో చేస్తున్నాను. ఆ పాత్ర ప్రభావం ప్రేక్షకులపై కచ్చితంగా ఉంటుందని అని చెప్పుకొచ్చాడు విజయ్.
పూరి జగన్నాధ్ మాట్లాడుతూ ‘విజయ్‌తో మళ్లీ కలిసి పనిచేయడం గొప్పగా అనిపిస్తుంది. ఇది ఒక బలమైన కథ, కథనంతో ఉన్న అల్టిమేట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌.’ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ బాషల్లో పాన్‌ ఇండియా సినిమాగా ఆగస్టు 3, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్‌ 2022లో షూటింగ్‌ ప్రారంభంకానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు