Prashant Varma – Ranveer Singh: ఇద్దరి మధ్య విభేదాలకు కారణం..?

Prashant Varma – Ranveer Singh.. హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి.. ఆయన టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చి స్టార్ హీరోల సినిమాలను కూడా బీట్ చేసి అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయారు. అలా తన అద్భుతమైన టాలెంట్ తో యంగ్ హీరోలను కూడా పాన్ ఇండియా హీరోలుగా మార్చి సత్తా చాటారు ప్రశాంత్ వర్మ. ఇలాంటి ఈయనకు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో విభేదాలు ఉన్నాయని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ విభేదాలకు పైగా ప్రశాంత్ వర్మ టీం మెంబర్ క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ విభేదాలు ఏంటి? ఎందుకు ఆయన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ప్రశాంత్ వర్మ – రణవీర్ సింగ్ మధ్య విభేదాలు:

Prashant Varma - Ranveer Singh: The reason for the differences between the two..?
Prashant Varma – Ranveer Singh: The reason for the differences between the two..?

హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తోందని.. ఆ సినిమా హనుమాన్ జయంతికి పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది అనే వార్తలు వచ్చాయి.. కానీ ఏమైందో తెలియదు కానీ సడన్ గా ఈ చిత్రం ఆగిపోయింది అని మళ్ళీ పుకార్లు రావడం మొదలయ్యాయి.. ముఖ్యంగా వీరిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్లే సినిమా ఆగిపోయిందనే పుకార్లు రావడంతో తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ టీం లోని ఒక మెంబర్.. ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఈ రూమర్స్ లో ఎటువంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

విభేదాలపై క్లారిటీ..

క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ప్రశాంత్ వర్మ రణవీర్ సింగ్ మధ్య గొడవలు వచ్చాయని.. ఎవరి దారి వారు చూసుకున్నారని వస్తున్న వార్తలలో నిజం లేదు. హనుమాన్ జయంతి రోజే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ను హైదరాబాదులో మొదలుపెట్టారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా ప్రశాంత్ ఈ సినిమా షూటింగ్ చేశారు. ఇప్పటికే కొన్ని సీన్లు కూడా పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అంటూ సదరు మెంబర్ స్పష్టత ఇచ్చారు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమాకి రాక్షస్ అని అంటున్నారు. హనుమాన్ సినిమా వర్క్ మెచ్చి ప్రశాంత్ కి రన్వీర్ అవకాశం ఇచ్చారట. ఇక ఈ సినిమా కూడా ప్రశాంత వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే రాబోతోందని సమాచారం.

- Advertisement -

రాక్షస్ కథ ఇదే.

మైథాలజికల్ బ్యాక్ గ్రౌండ్లో స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథగా ఈ సినిమా రాబోతుందని సమాచారం. రణవీర్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న తన భార్య దీపికా పదుకొనేతో ఎక్కువ సమయం గడుపుతున్నారని.. అందుకే ఈ సినిమాకి కాస్త గ్యాప్ ఇచ్చినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఆమె డెలివరీ తర్వాత భవిష్యత్తులో రణవీర్ సింగ్ నుంచి డాన్ 2, శక్తిమాన్ వంటి సినిమాలు కూడా రానున్నాయి. మొత్తానికి అయితే గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలకైతే ఇప్పుడు చెక్ పడిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు