Power Star : నిర్మాతలకు ఇబ్బందిగా పవన్ ?

పవన్ కళ్యాణ్..
వెండితెరపై కనిపిస్తే చాలు
ఆడియన్స్ బాడీ లో ఆటోమెటిక్ గా కరెంట్ పాస్ అవుతుంది,
థియేటర్ బ్యానర్స్ తో నిండిపోతాయి.
బొమ్మ పడితే థియేటర్ లో కాగితాల సునామి మొదలవుతుంది.
అరుపులు ఆకాశన్ని అంటుతాయి,
కలక్షన్స్ కొత్త దారులు వెతుకుతాయి.
అందరికి సాధ్యం కాదది,
ఒక సినిమా కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు అంటే, అది పవన్ కళ్యాణ్ సినిమా చెప్పొచ్చు.

ఈ గబ్బర్ సింగ్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ రాజకీయాల్లో ఉన్నా, సినిమాల్లో ఉన్న ఫ్యాన్స్ చూపించే ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. వకీల్ సాబ్ సినిమాతో ఇండస్ట్రీకి కమ్ బ్యాక్ ఇచ్చిన పవన్, బాక్సాఫీస్ పై యుద్ధం ప్రకటించాడు. దీని తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ సినిమా పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా చేసింది. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చాడు.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడానికి వచ్చింది. హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నట్టు స్వయంగా పవన్ యే ఇటీవల నాని అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పష్టం చేశారు. దీంతో పాటు తమిళ వినోదయ సీతం తెలుగు రీమేక్ ను సముథ్రకని దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి సైన్ చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇలా చేతిలో నాలుగు నుండి ఐదు సినిమాలు ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దసరా తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి, పొలిటికల్ టూర్ వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించాడు. ఈ ప్రకటన పవర్ స్టార్ ఫ్యాన్స్ కే కాదు, ఆయా సినిమాల నిర్మాతలకు కూడా కష్టంగానే ఉంది.

దసరా అంటే ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ కొద్ది సమయంలో పవన్ నాలుగు సినిమాల షూటింగ్ పూర్తి అవుతుందా ? అంటే కచ్చితంగా పూర్తి కావు అని చెప్పొచ్చు. అయితే ఈ సమయంలో హరి హర వీరమల్లు, భవదీయుడు భత్ సింగ్ తో పాటు వినోదయ సీతం తెలుగు రీమేక్ సినిమాలు పూర్తి చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ కొద్ది కాలంలో పవన్ కాల్షీట్స్ నిర్మాతలకు దక్కడం చాలా కష్టం. ఒక వేళ కాల్సీట్స్ వచ్చినా, సినిమాను అంత వేగంగా తెరకెక్కించడం ఇబ్బందికరమే. కానీ పవన్ మాత్రం ఈ టైం తన పాత్ర షూటింగ్స్ పూర్తి కావాలని నిర్మాతలకు చెబుతున్నారని సమాచారం. దీంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు