Pawan Kalyan : మరో సినిమానా ?

పవన్ కళ్యాణ్, టాలీవుడ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు. సినిమాలు ఫ్లాప్ అయినా, అసలు చేయకున్నా, పవర్ స్టార్ ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. వకీల్ సాబ్ సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రి ఇచ్చిన పవన్, తనకున్న ఫాలోయింగ్ ను మరింత పెంచుకున్నాడు. వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ, ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఈ సినిమాల షూటింగ్ జరుగుతున్నాయా, వాయిదా పుడుతున్నాయా అని పక్కన పెడితే, పవన్ లైనప్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది.

పవన్ ఇటీవల యాక్షన్ కింగ్ అర్జున్, మాస్ హీరో విశ్వక్ సేన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పూజా కార్యక్రామలకు హాజరయ్యాడు. క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించాడు కూడా. నిజానికి పవన్ మొదటి నుండే సినిమా ఈవెంట్ లకు దూరంగా ఉంటాడు. అవార్డు ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు రావడం చాలా తక్కువ. ఇక పూజా కార్యక్రమాలకు పవన్ రావడం అరుదు.

అర్జున్-విశ్వక్ సేన్ సినిమా ముహూర్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడంపై ఇండస్ట్రీ పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ మరో సినిమాను గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడని, ఆ సినిమా యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఉంటుందని ఈ వార్తల సారాంశం. దీనితో పాటు మరో వార్త కూడా వినిపిస్తోంది. యంగ్ హీరో విశ్వక్ సేన్ తో పవర్ స్టార్ మల్టీ స్టారర్ చేయబోతున్నారట. అందు కోసమే పూజా కార్యక్రమాలకు పవన్ హాజరయ్యాడట.

- Advertisement -

అయితే, పవన్ చేతిలో ఇప్పటికే ఐదు సినిమాల వరకు ఉన్నాయి. పవన్ డేట్స్ కోసం హరీష్ శంకర్ మూడేళ్లు, సురేందర్ రెడ్డి దాదాపు రెండేళ్ల నుండి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్తాయా అంటే, కష్టమే. దసరా తర్వాత పొలిటికల్ టూర్ కు పవన్ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మరో సినిమాకు పవన్ సైన్ చేస్తాడా ? ఒక వేళ వీరి కాంబోలో సినిమాలు లేకుంటే, అర్జున్-విశ్వక్ సినిమా ముహూర్తానికి పవన్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. అనే ప్రశ్నలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు