Pakka Commercial : పక్కా సేఫ్ గేమ్

ఒక సినిమా హిట్ కావాలంటే, ఎన్నో అద్భుతాలు జరగాలి. ఎంతో మంది కష్టపడాలి. మంచి స్టోరీ ఉండాలి. ఉత్తమ దర్శకత్వ ప్రతిభ ఉండాలి. స్టార్ హీరో, హీరోయిన్ తో పాటు పేరున్న నటీ నటులు కావాలి. వీటికి తోడు సినిమా నిడివి కూడా చాలా కీలకం. ఇటీవల కొన్ని సినిమాలు 3 గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. మరికొన్ని సినిమాలను రిజక్ట్ చేశారు.

నిజానికి ఒక సినిమాను 3 గంటల నిడివితో విడుదల చేస్తున్నారంటే, మేకర్స్ ధైర్యం చేస్తున్నట్టే. ఎందుకంటే, సినిమా పెద్దగా ఉంటే, ప్రేక్షకులకు బోర్ ఫీలింగ్ వస్తుంది. దీంతో నెగిటివ్ టాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయినా, “ఆర్ఆర్ఆర్” “పుష్ప” లాంటి సినిమాలు 3 గంటల నిడివితో వచ్చి ప్రేక్షకులను సంతృప్తి పరిచాయి. కానీ, నాని హీరోగా ఇటీవల వచ్చిన “అంటే సుందరానికీ” మాత్రం కాస్త తడపడింది. 3 గంటల 5 నిమిషాలున్న ఈ సినిమాను చూస్తే, ప్రేక్షకుడికి బోర్ ఫీలింగ్ వచ్చింది.

ఇలాంటి అనుభవాలను దగ్గర నుండి చూసిన డైరెక్టర్ మారుతి, తన సినిమా కోసం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. గోపిచంద్, రాశీఖన్నా హీరో, హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా “పక్కా కమర్షియల్”. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 1న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ప్రకారం, ఈ చిత్రం 2 గంటల 32 నిమిషాలు ఉండబోతుంది.

- Advertisement -

ఒక కామెడీ సినిమాకు సరిపోయే నిడివి ఇది. ఈ జోనర్ లో వచ్చే సినిమాలకు 3 గంటల నిడివి పెట్టవచ్చు. ఒక వేళ ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అయితే, ఫ్లాప్ టాక్ వస్తుంది. కాబట్టి, డైరెక్టర్ మారుతి ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా, షార్ట్ అండ్ స్వీట్ గా ఉండాలని ఇలాంటి రన్ టైమ్ ను సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇది చూసిన నెటిజన్లు, “పక్కా కమర్షియల్” టీం పక్కా సేఫ్ గేమ్ ఆడుతుందని కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు