NTR : న్యూ లుక్ అదుర్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ చిత్రంలో భీం పాత్ర పోషించిన ఎన్టీఆర్ నటన అద్భుతమనే చెప్పవచ్చు. ఈ నటనకు ఆస్కార్ ఇవ్వాలని సినీ అభిమానులు డిమాండ్ కూడా చేశారు. విదేశాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం విడులైనప్పుడు కూడా ఎన్టీఆర్ నటన గురించే  మాట్లాడుకున్నారు. అంత పెద్ద విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చే సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

ఇటీవల ఆచార్యతో అపజయం పాలైన కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం ప్రీ పొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది. వచ్చే నెలలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా..  ప్రస్తుతం అనూహ్యంగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 

ఆయన తన న్యూ లుక్ ను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఉంచారు. న్యూ డే.. న్యూ వైబ్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.  కొత్త లుక్ లో ఎన్టీఆర్ సూపర్ గా కనిపిస్తున్నారు. తారక్ న్యూ లుక్ అదిరింది అంటూ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఎన్టీఆర్ న్యూ లుక్ ను చూస్తే, బాద్ షా సినిమా గుర్తు వస్తుందని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా ఓ కమర్షియల్ యాడ్ కోసం తారక్ ఈ కొత్త లుక్ లోకి మారాడని సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్-కొరటాల సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు