Mega fans : వేకప్ దిల్ రాజు

మెగా హీరోలకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కలిసి రావడం లేదు అనేది ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోంది. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా, అది మల్టీ స్టారర్ కాబట్టి మొత్తం క్రెడిట్ మెగా హీరోకు ఇవ్వలేం. కానీ మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య ప్లాప్ తర్వాత, ఒక మంచి సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మెగా ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమా గతేడాది ఫిబ్రవరిలో అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమా నుంచి అధికారికంగా ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. RC15 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఇప్పటి వరకు దాదాపు 70 శాతం షూటింగ్ జరుపుకున్నారు. కనీసం టైటిల్ ను కూడా రివీల్ చేయలేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి గా ఉన్నారు. ట్విట్టర్ వేదికగా నిర్మాత దిల్ రాజ్ ను టార్గెట్ చేస్తు ట్రోల్స్ చేస్తున్నారు. దిల్ రాజ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ను ట్యాగ్ చేస్తూ, WAKE UP DILRAJU అంటూ ట్విట్టర్ ను షేక్ చేస్తున్నారు. నిద్ర మత్తు వదిలి RC15 నుంచి అప్ డేట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

సినిమాను ప్రకటించి ఏడాదిన్నర అవుతున్న ఒక అప్ డేట్ ఇవ్వకపోవడం ఏంటి అంటూ నిర్మాత దిల్ రాజును ట్రోల్స్ చేస్తున్నారు. కొన్ని సినిమాలలోని సీన్స్ తో దిల్ రాజుపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే దిల్ రాజు నిర్మిస్తున్న ‘’వారసుడు నుంచి 3 ఫస్ట్ లుకస్ రిలీజ్ చేశారు. కానీ, ఏడాదిన్నర ముందు ప్రకటించిన సినిమా నుంచి ఫస్ట్ లుక్ లేదు, అప్ డేట్ లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఈ ట్రోల్స్ తో అయినా, దిల్ రాజు, RC15 టీం ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు