NBK107 : మరింత ఆలస్యం

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా NBK107. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, అఖండ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, టీజర్ విపరీతమైన బజ్ ను క్రియేట్ చేశాయి.

కాగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ముందుగా అనుకున్నారు. కానీ, షూటింగ్ స్పీడ్ గా పూర్తి అవుతున్న క్రమంలో ఈ ఏడాది దసరా బరిలోనే నిలపాలని చూస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అందుకు అనుకూలంగా షూటింగ్ పనుల్లో కూడా వేగం పెంచారు. దీంతో దసరా బరిలో NBK107 తో బాలయ్య, గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ పోటీలో ఉంటారని భావించారు.

అయితే ఇటీవల బాలయ్య కరోనా బారీన పడ్డారు. కోలుకున్నారు కూడా. అయితే బాలయ్యతో పాటు మూవీ టీంలో ఉన్న చాలా మందికి కరోనా వైరస్ సోకిందని సమాచారం. దాంతో, చేసేది ఏమీ లేక, డైరెక్టర్ గోపిచంద్ ఈ సినిమా షూటింగ్ వాయిదా వేశారని తెలుస్తుంది. ఈ సినిమా ముందు అనుకున్న షెడ్యూలు పూర్తిగా మారిపోయింది. షూటింగ్ వాయిదా పడటంతో దసరా బరిలో నిలుపుదామనుకున్న నిర్మాతల ఆలోచన వర్కౌట్ అయ్యేలా లేదు. దసరాలోపు షూటింగ్ పూర్తి కావడం కష్టమే అని టాక్. అఖండ లాగే NBK107 డిసెంబర్ లోనే విడుదల చేసే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు