ఆమె ఓ సక్సస్ ఫుల్ హీరోయిన్. సౌత్ సినిమా పైనే చెరుగని ముద్ర వేసింది. దాదాపు అగ్ర హీరోలు అందరితోనూ ఆడిపాడింది. కెరీర్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ లను కొట్టేసింది. ఆమెనే నయనతార. కేరళలో పుట్టిన ఈ భామ, మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో చాలా ఏళ్ల పాటు అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. సక్సస్ ఫుల్ కెరీయర్ ఉన్న ఈ హీరోయిన్, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే నయన్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే.
దాదాపు ఏడేళ్ల పాటు సాగిన వీరి లవ్ ట్రాక్ కు బ్రేకులు వేస్తూ, ఈ రోజు పెళ్లి పీటలు ఎక్కారు ఈ ప్రేమ జంట. తమిళనాడులోని మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో తెల్లవారు జామున 2:22 నిమిషాలకు అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య నయన్ – శివన్ ఒక్కటైయ్యారు. 8:10 నిమిషాల నుండి రిసేప్సన్ వేడుక ప్రారంభమైంది. ఈ వేడుకకు టాలీవుడ్ అగ్ర నటీ నటులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సమంత తో పాటు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా హాజరు కాబోతున్నారు. వీరితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు వెళ్లనున్నారు.
కాగ ఈ పెళ్లిని కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ప్లిక్స్, ఈ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. దీని కోసం నెట్ ప్లిక్స్ భారీ ధరను కూడా చెల్లించినట్టు తెలుస్తుంది. అయితే నయన్ – విఘ్నేష్ పెళ్లికి సంబంధించిన ఫోటోలను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ పెళ్లి ఫోటోలు ఒక్కటి కూడా బయటకు రాలేవు.
Wedding bells! Wikki & Nayan to tie knot at 8.30 am tomorrow!! @VigneshShivN #Nayanthara #Nayantharawedding #NayantharaVigneshShivan #wikkinayanwedding pic.twitter.com/wBMeLe0txQ
— DT Next (@dt_next) June 8, 2022