Repeat : నవీన్ వేట మొదలైంది

ప్రస్తుతం కాలంలో ప్రేక్షకులు ఓటీటీలలో వచ్చే సినిమాలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే దర్శక నిర్మాతలు కూడా ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లనే ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు. కొంత మంది యంగ్ హీరోలు వరుసగా ఓటీటీల్లోనే కనిపిస్తున్నారు. అందులో నవీన్ చంద్ర ఒకరు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ చంద్ర.. తర్వాత విభిన్న పాత్రలో కనిపించాడు. కొన్ని సినిమాల్లో నెగిటివ్ పాత్రలో కూడా నవీన్ కనిపించాడు.

ప్రస్తుతం నవీన్ చంద్ర ఓటీటీలపై ఫోకస్ పెట్టాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో నవీన్ చంద్ర భారీగా ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో పరంపర, పరంపర-2 వెబ్ సిరీస్ ల్లో నవీన్ చంద్ర కనిపించాడు. తాజాగా మరోసారి హాట్ స్టార్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. “రిపీట్” అనే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు.

ట్రైలర్ ప్రారంభంలోనే “గేమ్ మొదలు పెట్టిన ఫస్ట్ మూవ్ లోనే ఒకడు మనకు చెక్ పెడితే.. ఎలా ఉంటుందో అలా ఎదురైంది నాకు ఈ కేసు” అంటూ నవీన్ చంద్ర చెప్పే డైలాగ్ తో సినిమా పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాగే “ప్రతి స్టెప్ లోనూ నాకు చెక్ పెడుతూ వచ్చాడు. ఒకడు ఆటలో అంత సులభంగా గెలిస్తే మజా ఏముంటుంది. ఒక క్రిమినల్ అయిన వాడే అలా ఆడితే. ఒక ఐపీఎస్ అయిన నేను ఇంకెలా ఆడాలి“ అంటూ నవీన్ చెబుతున్న డైలాగ్స్ తో ఈ సినిమా మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా ఉంటుందని తెలుస్తుంది.

- Advertisement -

ఈ సినిమాలో నవీన్ చంద్ర ఐపీఎస్ పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే సత్యం రాజేష్, సుదర్శన్, స్వామిరారా ఫేమ్ పూజా రామచంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు