Naga Chaitanya : సక్సెస్ ఫార్ములాకే ఓటు !

టాలీవుడ్ లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలంటే, పెద్ద హీరో, సక్సస్ ఫుల్ హీరోయిన్ ఉండాలి. స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించాలి. భారీ బడ్జెట్ తో సినిమా చేయడానికి అయినా, సిద్ధంగా ఉండే నిర్మాత కావాలి. ఇలాంటి కాంబో ఉంటేనే అప్పట్లో సినిమాలు హిట్ అయ్యేవి. కానీ, ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల టెస్ట్ మారింది. పెద్ద నటీ నటులు కాదు, మంచి స్టోరీ ఉంటే సక్సెస్ గ్యారంటీ.

ఈ తరుణంలో హీరోలు తమ సినిమాను హిట్ చేయడానికి ప్రేక్షకులు మెచ్చే స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారు. అంతే కాకుండా, వాళ్ల కెరీర్ లో హిట్ పడ్డ సినిమాల సక్సెస్ ఫార్ములాను కూడా కొనసాగిస్తున్నారు. వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న నాగ చైతన్య కూడా దీన్నే ఫాలో అవుతున్నాడు.

నాగ చైతన్య కెరీర్ లో “ప్రేమమ్” ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మలయాళంలో వచ్చిన “ప్రేమమ్” సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ సినిమా తర్వాత పలు సినిమాలు చేసినా, అంతంటి విజయం మాత్రం దక్కలేదు. మళ్లీ 2019లో వచ్చిన “మజిలీ”, నాగ చైతన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ రెండు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్.. హీరో రెండు విభిన్న వేరియేషన్స్ లో కనిపించడం. టీనేజ్ లో ఒకటి, యంగ్ ఏజ్ లో ఒకటి. ఇలా రెండు వేరియేషన్స్ నాగ చైతన్య కనిపించి, ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సక్సెస్ ఫార్ములాను మరోసారి కొనసాగిస్తున్నాడు నాగ చైతన్య.

- Advertisement -

ఈ అక్కినేని హీరో ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో “థాంక్యూ” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా నాగ చైతన్య మూడు విభిన్న వేరియేషన్స్ లో కనిపించబోతున్నారని, ఇటీవల విడుదలైన టీజర్ ద్వారా తెలుస్తుంది. టీనేజర్, యంగ్ హాకీ ప్లేయర్ తో పాటు మరో పాత్రలో వేరియేషన్స్ చూపిస్తున్నట్టు సమాచారం. అందుకే ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్స్ గా ఉన్నారని అర్థమవుతుంది. ముగ్గురు మీరోయిన్స్ తో ఒక్కో సమయంలో నాగ చైతన్య రొమాన్స్ చేస్తాడని టాక్.

నిజానికి ఒక హీరో మూడు విభిన్న వేరియేషన్స్ లో కనిపించడం అంత సులువేమీ కాదు. కొంచెం తేడా వచ్చినా, నెటిజన్స్ ట్రోల్స్ కు గురికాక తప్పదు. కానీ ఇప్పటికే ఇలాంటి పాత్రల్లో నటించిన నాగ చైతన్య, ఈ సినిమాలో కూడా తనదైన మార్క్ నటన చూపించాడని సమాచారం. అందువల్ల నాగ చైతన్యకు ఈ సక్సెస్ ఫార్ములాతో మరిసారి హిట్ కొట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు