Vaishnav Tej: మెగా మేనల్లుడి దూకుడు

టాలీవుడ్ లో హీరోగా నిలద్రొక్కుకోవాలి అంటే టాలెంట్ మాత్రమే సరిపోదు, కథలు ఎంచుకునే విధానం, అభిమానులను కలుపుకుపోయే తీరు, వేదికలపై మాట్లాడే పద్ధతి ఇవన్నీ ఉండాలి. దాదాపుగా ఇవన్నీ మెగా హీరోలు అందరిలో ఉండటం వలన ఇప్పటికి మంచి విజయాలతో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినంత మంది హీరోలు మరే కుటుంబం నుంచి రాలేదు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరు తమకంటూ కొంత ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు . కొన్ని సినిమాలు తేడా కొట్టిన కూడా ఇంకో సినిమాతో అభిమానులను థియేటర్ కి తీసుకురాగలిగేంత ప్రేమను సాధించుకున్నారు అంటే అతిశయోక్తి కాదు.

“ఉప్పెన” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. తన రెండవ సినిమానే క్రిష్ లాంటి విలక్షణ దర్శకుడితో చేసిన వైష్ణవ్, ప్రస్తుతం “శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర” బ్యానర్ లో ‘రంగ రంగ వైభవంగా’ సినిమాను చేస్తున్నాడు.

- Advertisement -

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ సితార ఎంటర్టైన్మెంట్స్‌లో ఒకేసారి రెండు మూడు చిత్రాలకు ఒప్పందం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే తన దూకుడు పెంచి ఇంత త్వరగా ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ లైన్ లో పెట్టడం, కెరీర్ ఆరంభంలో వరుసగా మైత్రీ, ఎస్వీసీసీ, సితార లాంటి పెద్ద బేనర్లలో సినిమాలు చేయడం అంటే అభినందిచాల్సిన విషయమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు