Mega 154: మెగా సెట్లో మాస్ మహారాజా

మాస్ మహారాజా రవితేజ చివరి చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు రవితేజ. రామారావు ఆన్ డ్యూటీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర ప్రొమోషన్స్ కూడా మొదలుపెట్టేసారు. రామారావు చిత్రంలో ప్రముఖ పోలీస్ పాత్రలో ఒకప్పటి హీరో వేణు కనిపిస్తున్నారు. రావణాసుర, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు ఇంకా రవితేజ చెయ్యాల్సిన ఖాతాలో ఉన్నాయి.
వీటితో పాటు మరో మెగా ప్రాజెక్ట్ లో రవితేజ నటించాల్సి ఉంది.

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రముఖ దర్శకులతో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో మెగాస్టార్ కొత్త సినిమా వాల్తేరు వీరయ్య ఒకటి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.

తాజాగా మాస్ మహారాజా రవితేజ ఈరోజు మెగా సినిమా సెట్స్‌పైకి జాయిన్ అయ్యారు. చిరు, రవితేజ తదితరులు పాల్గొన్న ప్రధాన సన్నివేశాలను బాబీ తెరెకెక్కించనున్నాడు. ఈ షెడ్యూల్‌లో ఓ మాస్‌ ఇంట్రో సాంగ్‌ని కూడా చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ప్రస్తుత షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. రవితేజ మెగా సెట్లో జాయిన్ అయిన వీడియోను అధికారికంగా రిలీజ్ చేసింది మూవీ టీం.

- Advertisement -

మైత్రీ మూవీ మేకర్స్ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2023 సంక్రాంతికి కానుకగా విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు