Lokesh Kanagaraj: “మాస్టర్” ప్లాన్

ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు లోకేష్ కనగరాజ్.
దీనికి కారణం ఆయన కొట్టిన సక్సెస్. “నగరం” సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ వరుస హిట్ సినిమాలు చేసాడు. తన మొదటి సినిమాతోనే రైటింగ్ లోని బ్రిలియన్స్ ను, డైరెక్షన్ లోని టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు.

“నగరం” తరువాత హీరో కార్తీ తో చేసిన “ఖైదీ” సినిమా కూడా భారీవిజయాన్ని సాధించింది. ఆ తరువాత ఇళయ దళపతి విజయ్ ను హీరోగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ను విలన్ గా పెట్టి తెరకెక్కించిన “మాస్టర్” సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

రీసెంట్ గా ఉలగనాయగన్ కమల్ హాసన్ కథానాయకుడి చేసిన “విక్రమ్” సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కమల్ హాసన్ ఈ మధ్య కాలంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చినా, ఆ గ్యాప్ ను “విక్రమ్” సినిమా సక్సెస్ కవర్ చేసిందనేది చాలామంది అభిప్రాయం. లోకేష్ “విక్రమ్” సినిమాను “ఖైదీ” సినిమాకి లింక్ పెట్టి మలిచిన విధానం, రోలెక్స్ పాత్రలో సూర్య కేరక్టరైజేషన్ డిజైన్ చేసిన తీరు లోకేష్ టాలెంట్ కి నిదర్శనం.

- Advertisement -

ప్రస్తుతం లోకేష్ ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు తాను తరువాత విజయ్ తో చేయబోయే సినిమాలో ధనుష్ ను విలన్ గా పెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే ధనుష్‌కు కథ వినిపించాడట. ధనుష్ కి కూడా పాత్ర బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు