మాస్ కా దాస్ – యాంకర్ కి మాస్ వార్నింగ్

దినేష్ నాయుడు ఈ పేరు తో పెద్దగా పరిచయం లేకపోవచ్చు
కానీ విశ్వక్ సేన్ అంటే కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.
వెళ్ళిపోమాకే అనే సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్.
ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.
ఆ తరవాత హీరోగానే కాకుండా ఒక దర్శకుడిగా కూడా “ఫలక్ నామా దాస్” సినిమాతో మంచి మార్కులే సాధించుకున్నాడు.
చెప్పుకు అంటుకున్న చూయింగ్ గమ్ లా
విశ్వక్ చుట్టూ వివాదాలు ఎప్పటికప్పుడు తిరుగుతూనే ఉంటాయి.
ఫలక్ నామా దాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “నన్ను ఎవడు లేపక్కర్లేదు నన్ను నేనే లేపుకుంటా” అన్న దగ్గర నుంచి అప్పట్లోనే పోస్టర్స్ చింపే వివాదాం వరకు అన్ని చిన్నపాటి సంచలనాలే.

అలానే ఇప్పుడు ఇంకో వివాదాం విశ్వక్ చుట్టు తిరుగుతుంది.
విశ్వక్ చేసిన రీసెంట్ ఫిలిం “అశోక వనంలో అర్జున కళ్యాణం” ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ టీం ఒక ప్రాంక్ వీడియో ప్లాన్ చేసింది. అది కాస్త బెడిసికొట్టి మీడియాలో చర్చినీయాంశం అయింది.
ఈ ఇస్స్యూ పై డిబేట్ పెట్టిన ఒక ప్రముఖ ఛానల్ లో విశ్వక్ హాజరు అయ్యాడు. ఆ డిబేట్ లో సదరు యాంకర్ కొన్ని అభ్యంతర పదాలు వాడుతూ పాగల్ సేన్ అనడం విశ్వక్ కు కోపం తెప్పించాయి.
దానితో విశ్వక్ వెంటనే తనదైన శైలిలో యాంకర్ కు దిమ్మదిరిగే మాస్ వార్నింగ్ ఇచ్చాడు, దీనితో యాంకర్ గెట్ అవుట్ అఫ్ మై స్టూడియో అంటూ విశ్వక్ పై విరుచుకుపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు