Mahesh Babu : సెంటిమెంట్ ఫాలో అవుతాడా..?

సినిమా హీరోలకు సెంటిమెంట్స్ ఉండటం వెరీ కామన్. ప్రతి ఒక్క హీరో ఎదోక సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఉంటాడు. సినిమాలను ఒకే డేట్ కు రిలీజ్ చేయడం, మూవీ అనౌన్స్ ఇవ్వడం తో పాటు ఒకే డైరెక్టర్ తో సినిమాలు చేయడం ఇలా సెంట్ మెంట్ ను నమ్ముతుంటారు. మెగా స్టార్ చిరంజీవి నుండి చిన్న హీరోల వరకు సెంటిమెంట్స్ ను ఫాలో అవుతారు. అలాగే ప్రిన్స్ మహేష్ బాబుకు కూడా ఓ సెంట్ మెంట్ ఉందండోయో…

సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు ఈ నెల 31న రాబోతుంది. ఈ తేదీని.. మహేష్ బాబు గుడ్ సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడు. ప్రతి ఏడాది ఈ తేదీన తాను చేయబోయే సినిమాల అప్ డేట్స్ ఇస్తూ ఉంటాడు. అయితే ఈ సారి కూడా కృష్ణ పుట్టిన రోజుకు ఘట్టమనేని ఫ్యాన్స్ కోసం బిగ్ సర్ప్రైజ్ లు ప్లాన్ చేసే ఉంటాడు మహేష్.

ప్రస్తుతం మహేష్ బాబు రెండు సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తుండగా, దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళితో మరో మూవీ చేస్తున్నాడు. ఈ రెండు మూవీలు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే రాగ, అప్ డేట్స్ మాత్రం రాలేదు. దీంతో ఈ సారి కృష్ణ పుట్టిన రోజుకు ఈ రెండు మూవీస్ నుండి అప్ డేట్స్ వచ్చే అవకాశముందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

త్రివిక్రమ్-మహేష్ సినిమా ఇప్పటికే SSMB28 పేరుతో ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. దీంతో ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ గానీ, మోషన్ పోస్టర్ గానీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ జక్కన్న-మహేష్ కాంబో మూవీ చేస్తామని అనౌన్స్ మాత్రమే వచ్చింది. ఇంకా స్టోరీ కూడా ఫైనల్ కాలేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. దీంతో ఈ మూవీ విషయంలో ప్రిన్స్ ఫ్యాన్స్ కు నిరాశ మిగిలే అవకాశముంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు