Krithi Shetty : రియల్ లైఫ్ లోనూ..

కన్నడ బ్యూటీ కృతి శెట్టి, ఒక్క ఉప్పెన సినిమాతోనే ఇండస్ట్రీని తన వైపు తిప్పుకుంది. తన నటన, అందంతో అందరినీ కట్టిపడేసింది. బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఉప్పెన ఇచ్చిన సక్సెస్ తో కృతి శెట్టి కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో తను నటించిన తొలి సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందు నుంచే వరుసగా కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నాయి. దీంతో డిమాండ్ ఎక్కువ ఉన్న హీరోయిన్ గా మారింది.

అయితే, ఈ రోజు కృతి శెట్టి నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రం విడుదలైంది. ఇందులో సుధీర్ బాబుతో ఆడి పాడింది ఈ సుందరి. ఈ నేపథ్యంలోనే తన ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. వాటిలో తమిళ హీరో విజయ్, సూర్య, రామ్ చరణ్, మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమిళంలో ఈ బ్యూటీ ప్రస్తుతం సూర్యతో వనంగాన్ అనే సినిమా చేస్తోంది.

అయితే ఓ ఫ్యాన్ సూర్య గురించి ఒక్క మాటలో చెప్పండి అని అడిగాడు. దానికి కృతి స్పందిస్తూ “ఆయన చాలా గౌరవనీయులైన వారిలో ఒకరు. ఆయనను నేను కలిశాను. ఆయనతో సెట్లో ఉన్న ప్రతిక్షణం నాకు ఒక కలలాగా అనిపించింది” అని చెప్పింది. తమిళ మరో సూపర్ స్టార్ విజయ్ గురించి ఓ ఫ్యాన్ అడగగా, “ఆయన రీల్ లైఫ్ లో అలాగే రియల్ లైఫ్ లోను సూపర్ స్టార్” అని సమాధానం ఇచ్చింది. అచ్చం ఇలాంటి అభిప్రాయమే తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు పై కూడా వ్యక్తం చేసింది. రామ్ చరణ్ గురించి అడగగా, “ఆయన జన్యున్ మనిషి అని విన్నాను” అని చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు