అఖిల్ అక్కినేని, ఎన్ని సినిమాలు చేసిన ఒక మంచి విజయం దక్కడం లేదు. గతేడాది “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమా తో హిట్ అందుకున్నాడు. కానీ, అది సూపర్ హిట్ ఏం కాదు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం “ఏజెంట్”. ఈ సినిమాలో అఖిల్ ఓ పవర్ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అందరినీ ఆకట్టుకుంటుంది. టీజర్ లో హాలీవుడ్ లెవెల్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
టీజర్ కు మంచి స్పందన కూడా వస్తోంది. ఇప్పటికే కొంత మంది సెలబ్రెటీలు టీజర్ పై ప్రశంసలు కురిపించారు. తాజా గా శ్రీ మంతుడు మహేష్ బాబు “ఏజెంట్” టీజర్ చూసి అక్కినేని అఖిల్ ని అభినందించారు. అంతేకాదు ఏజెంట్ టీజర్ ను తన ట్విటర్లో షేర్ చేస్తూ ” ఏజెంట్ టీజర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, థీమ్ చాలా బాగా నచ్చింది. సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్”. అంటూ సూపర్ స్టార్ ట్వీట్ చేశాడు. దీనిపై అక్కినేని అఖిల్ స్పందిస్తూ ” థాంక్యూ బ్రదర్, మీ సపోర్ట్, ప్రోత్సాహం చాలా విలువైనది”. అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. అయితే టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ దాటడం గమనార్హం. ఈ మూవీ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని అభిమానులను, సినీ ప్రేమికులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
#AgentTeaser looks absolutely stunning!! Love the visuals and the theme of the film! All the best @mammukka sir @AkhilAkkineni8 @AnilSunkara1 @DirSurender and the entire team! Looking forward! 🙂https://t.co/ecNasoflIr
— Mahesh Babu (@urstrulyMahesh) July 16, 2022
Thank you so much brother 🙏🏻 we are thrilled to see your support and encouragement. Means a lot 🙏🏻 https://t.co/ps7kOMeAdT
— Akhil Akkineni (@AkhilAkkineni8) July 16, 2022