Guntur Kaaram: మహేష్ ఫ్యాన్స్‌లో భయం… ప్రశాంత్ వర్మపై ట్రోల్స్ స్టార్ట్

గుంటూరు కారం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇన్నాళ్లు సినిమాపైన జరిగిన చర్చ వల్ల ఎక్కడలేని హైప్ వచ్చింది. అంతే కాదు, రీసెంట్‌గా సినిమా నుంచి కూర్చి మడతపెట్టి… అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ పై కొంత వరకు ట్రోల్స్ వస్తున్నా.. ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్‌కు ఓ భయం పట్టుకుంది. అదేంటంటే… హనుమాన్.

హనుమాన్ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయించడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయినా, ఇలాంటివి ఎదురైన హనుమాన్ ను జనవరి 12నే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంది టీం. దీంతో గుంటూరు కారం మూవీపై ఒత్తిడి పడుతుంది. ఇక ఫ్యాన్స్ అయితే ఏకంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ట్రోల్స్ చేస్తున్నారు.

దేవుడి ఫోటో అడ్డు పెట్టుకుని తన సినిమాకు పోటీగా వస్తున్నాడు అంటూ ప్రశాంత్ వర్మపై ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సెంటిమెంట్‌తో గుంటూరు కారం సినిమాను బీట్ చేయాలని చూస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

అయితే గుంటూరు కారం సినిమాపై ఇటు మహేష్ అభిమానులు గానీ, అటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ కానీ, చాలా నమ్మకంతో ఉన్నారు. ఇక ప్రొడ్యూసర్ నాగ వంశీ అయితే… చాలా కాన్ఫిడెంట్‌గా గుంటూరు కారం బ్లాక్ బస్టర్ హిట్ అని ఇప్పటి నుంచే చెబుతున్నాడు. కానీ, హనుమాన్ సెంటిమెంట్ వర్కౌట్ అయితే, తమ సినిమాపై ఎఫెక్ట్ పడుతుందనే ఆలోచన కూడా ఉంది.

అటు హనుమాన్ టీం కూడా గుంటూరు కారం సినిమాను తక్కువ అంచన వేయడం లేదు. మహేష్, త్రివిక్రమ్ ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత ఆ సినిమాతో పోటీ పడాలంటే తప్పకుండా ఆలోచిస్తారు. అంతే కాదు.. హనుమాన్ మూవీ టీం షూటింగ్ కంప్లీట్ చేసుకుని, దాదాపు ఏడాది పాటు కేవలం వీఎఫ్ఎక్స్ పనులపైనే కూర్చున్నారు. ఇంత వర్క్ చేసి రిస్క్ చేయడానికి రెడీగా ఉండక పోవచ్చు.

అందుకే హనుమాన్ రిలీజ్ డేట్ ను జనవరి 12 కాకుండా రెండు మూడు రోజుల ముందు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వచ్చింది. కానీ, ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దూకుడు చూస్తే హనుమాన్ జనవరి 12నే విడుదల చేయబోతున్నారని అర్థమవుతుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు