సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట భారీ అంచనాలతో ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీమియర్, బెనిఫిట్ షో ల నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. మహేష్ టైమింగ్, కీర్తి సురేష్ తో కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో మహేష్ వరుసగా నాలుగో హిట్ అందుకున్నట్టే అని ఫ్యాన్స్ అభిప్రాయం.
ప్రిన్స్ మహేష్ దీనికి ముందు కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు, భరత్ అనే నేను, వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మహర్షితో పాటు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలు చేశాడు. ఈ నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాయి. అయితే ఈ సినిమాల్లో మహేష్ బాబుకు బాగా కలిసొచ్చిన అంశం సోషల్ మెసేజ్
శ్రీమంతుడులో ధనవంతులు గ్రామాలను దత్తత తీసుకోవడం, భరత్ అనే నేను లో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మహర్షిలో వ్యవసాయం ప్రాధాన్యత చెబుతూ, వీకెండ్ ఫార్మింగ్ ని చూపించడం, అలాగే సరిలేరు నీకెవ్వరు లోనూ సైనికుల గురించి, దేశభక్తి గురించి మెసేజ్ ఇచ్చాడు.
తాజా గా సర్కారు వారి పాట మూవీలోనూ సమాజానికి సూపర్ స్టార్ ఓ పవర్ ఫుల్ మెసేజ్ ను అందించాడు. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న స్కామ్స్, వాటిని అరికట్టడానికి ప్రజలు ఏం చేయాలని సినిమాలో చూపించాడు.
ప్రిన్స్ మహేష్ ఇప్పటి వరకు సోషల్ మెసేజ్ ఇచ్చిన నాలుగు సినిమాలు హిట్ అందుకున్నాయి. ఇప్పుడు సర్కారు వారి పాట కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ జోస్యం చెబుతున్నారు. కాగ మహేష్ సినిమాలు హిట్ కావడానికి కలిసొచ్చిన అంశాన్నే కంటిన్యూ చేస్తున్నాడని క్రిటిక్స్ అంటున్నారు.