The Warriorr : లింగుస్వామి అదే తప్పు ?

రామ్ హీరోగా నటించిన ది వారియర్ చిత్రం గురు వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తెలుగు తో పాటు తమిళంలో కూడా ఈ చిత్రం విడుదలయ్యింది. మొదటి షోతో నే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ నమోదైంది. అయినా, ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి అని టాక్. కలెక్షన్ల విషయాన్ని పక్కన పెట్టేస్తే, ది వారియర్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఈ చర్చకు కారణం దర్శకుడు లింగుస్వామి.

విషయం ఏంటంటే, స్పైడర్ సినిమా విషయంలో మురుగదాస్ చేసిన తప్పే, ది వారియర్ విషయంలో లింగుస్వామి కూడా చేశాడని నెటిజన్ల అభిప్రాయం. ఈ చిత్రంలో విలన్ గా ఆది నటించాడు. ఆది క్యారెక్టరైజేషన్ ను దర్శకుడు బాగానే డిజైన్ చేశాడు. ఎంత అంటే, హీరోను డామినేట్ చేసేంతగా. ఆదికి జోడీగా ఓ హీరోయిన్ ను కూడా పెట్టాడు. అంతే కాకుండా ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టాడు. మంచి ఇంట్రో సీన్ ఇచ్చాడు. కొన్ని సిన్నివేశాల్లో హీరో కన్నా విలన్ పాత్రనే హైలైట్ చేశాడు.

ఓవరాల్ గా సినిమా మొత్తాన్ని తమిళ ప్రేక్షకులు మెచ్చే విధంగా తీశాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమిళంలో రామ్ ఎంట్రీ ఈ సినిమాతోనే. కాబట్టి వీటికి అడ్డు చెప్పి ఉండకపోవచ్చు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

స్పైడర్ సినిమాలో మురుగదాస్ కూడా దీన్నే ఫాలో అయ్యాడు. కానీ, అది తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు