Liger : లైన్ క్లీయర్ ఇంకెప్పుడు ?

సినీ ఇండస్ట్రీలో దర్శకుల మధ్య ఎంత పోటీ ఉందో అందరికీ తెలుసు. ఒక్క సినిమా ఫట్ అయినా, ఆ దర్శకుని వైపు చూడరు. అందుకే డైరెక్టర్లు కాస్త సమయం తీసుకున్నా, మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి కష్టపడతారు. ఇందులో ఎస్.ఎస్ రాజమౌళి తర్వాతే ఎవరైనా. ఒక సినిమా చేయడానికి రెండు నుండి మూడేళ్ల సమయం తీసుకుంటారు జక్కన్న. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాకు అయితే ఏకంగా నాలుగేళ్లు తీసుకున్నారు. అభిమానులను ఎంత వెయిట్ చేయించారో, అంత పెద్ద హిట్ ఇచ్చాడు.

అయితే ఈ దర్శకధీరుడు మాత్రం మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా చేరాలని అనుకుంటాడు. “సినీ చరిత్రలో ఆరు నెలల్లో సినిమా చేసే సత్త ఒక పూరి జగన్నాథ్ కు మాత్రమే ఉంటుంది. బ్యాంకాక్ బీచ్ లో ఒక నెల రోజులు కూర్చుంటే, అద్భుతమైన కథ వస్తుంది. ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి, పోస్టు ప్రొడక్షన్ ను పూర్తి చేస్తాడు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది” అంటూ బిజినెస్ మెన్ ఆడియో లాంచ్ వేదికగా జక్కన్న చెప్పిన మాటలు ఇప్పటికీ మర్చిపోలేం.

నిజానికి పూరికి ఒక సినిమాను ఎక్కువ రోజులు షూట్ చేయడం నచ్చదు. ఇప్పటి వరకు ఇదే స్ట్రైల్ లో పని చేశాడు పూరి. కానీ, లైగర్ సినిమా విషయంలో ఈ మాస్ డైరెక్టర్ ఎందుకు ఆలస్యం చేస్తుండో ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ ప్రకటన 2019లోనే వచ్చింది. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్లు సినిమా ఆగిపోయింది. మొత్తంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి అయినా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్ల మళ్లీ ఆగిపోయింది.

- Advertisement -

నిజానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూరి జగన్నాథ్ రెండు నెలల్లో పూర్తి చేస్తాడు. పూరి లెక్కలు ఇక్కడ పని చేయడం లేదు. ఆగస్టు 25న విడుదల తేదీ అని అధికారికంగా ప్రకటించారు. కానీ, ఈ సినిమా పనులు అప్పటికి పూర్తి అవుతాయా అంటే, క్లారిటీ లేదు. అయితే పూరీ-విజయ్ దేవరకొండ ప్రస్తుతం జన గణ మన సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హడావిడిలో పడి, లైగర్ ను మర్చిపోయారా అని నెటిజన్ల నుండి ప్రశ్నలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు