Liger: అంచనాలు పెంచుతోంది

బద్రి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను పొందుకున్నారు. ఒక డిఫరెంట్ క్యారక్టర్జేషన్ క్రియేట్ చేసి హిట్ కొట్టడం పూరికి పెన్నుతో పెట్టిన విద్య. స్టార్ హీరోలకి హిట్స్ ఇచ్చిన ఘనత పూరిది.

2015 లో టెంపర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పూరిజగన్నాథ్ తరువాత వరుస ఫెయిల్యూర్స్ చూసి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో “జనగణమన” సినిమా చేస్తున్నాడు. ఇదివరకే వీళ్ళ కాంబినేషన్ లో లైగర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం లైగర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఆగస్ట్ 25న రిలీజ్ అవుతున్న లైగ‌ర్‌ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే నటిస్తుంది.

ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. నేడు మైక్ టైసన్ పుట్టినరోజు సంధర్బంగా లైగర్ యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో మైక్ టైసన్ షూటింగ్‌లో పాల్గొన్నప్పటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి.పూరి, ఛార్మి, కరణ్ జోహార్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే తదితరులు మైక్ టైసన్‌కు పుట్టినరోజు అభినందనలు తెలియజేశారు. విడుదల చేసిన ఈ వీడియోలో మైక్ టైసన్ జోష్ చూస్తుంటే లైగర్ సినిమాపై అంచనాలు ఇంకా పెరుగుతున్నాయి.

- Advertisement -

ఏదిఏమైనా గతంలో అమితాబ్ బచ్చన్, ఇప్పుడు మైక్ టైసన్ లాంటి లెజెండ్స్ తో వర్క్ చేయడం పూరి జగన్నాథ్ కి మాత్రమే దక్కిన అరుదైన అవకాశం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు