OTT Movies : ఈ వారం ఓటిటి స్ట్రీమింగ్ మూవీస్ లిస్ట్

సినీ ప్రియులకు నవంబర్ చాలా బోరింగ్ గా గడుస్తోంది. ఒకవైపు ఐపీఎల్ ఫీవర్, మరోవైపు ఎలక్షన్స్ అంటూ పొలిటికల్ హీట్ పెరగడంతో ఈ నెలలో సినిమాలను రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపించడం లేదు. చిన్నాచితకా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ పెద్దగా సందడి ఏం కనిపించలేదు. ప్రస్తుతం ‘మంగళవారం’ సినిమాతో థియేటర్లు నెట్టుకొస్తున్నాయి. ఇక థియేటర్ల సంగతి పక్కన పెడితే, ఎప్పటిలాగా ఈవారం కూడా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ వంటి ఓటీటి ప్లాట్ఫామ్ లలో పలు సినిమాలు ప్రీమియర్ కానున్నాయి. ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.

1. ఓపెన్ హైమర్
ఈ ఏడాది రిలీజ్ అయిన బిగ్గెస్ట్ హాలీవుడ్ మూవీస్ లో ‘ఓపెన్ హైమర్’ ఒకటి. క్రిస్టోఫర్ నోలాండ్ బ్రాండ్ ఇమేజ్ తో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈనెల 22న ‘ఓపెన్ హైమర్’ మూవీ బుక్ మై షోలో ప్రసారం కానుంది.

2. స్క్విడ్ గేమ్ : ది ఛాలెంజ్
ఓటిటి ప్రియులను ఉర్రూతలూగించిన స్క్విడ్ గేమ్ మరో సిరీస్ ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది. స్క్విడ్ గేమ్ : ది ఛాలెంజ్ ఈనెల 22న నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.

- Advertisement -

3. పులిమడ
జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మలయాళ మూవీ ఈనెల 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

4. గ్రాన్ టురిస్మో
ఇటీవల కాలంలో ప్రేక్షకులకు ఆసక్తి కలిగించిన కార్ రేసింగ్ మూవీస్ లో ఇది ఒకటి. ఈనెల 25 నుండి నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది.

5. మై డిమాన్
ఈ యానిమేటెడ్ మూవీ నెట్ ఫ్లెక్స్ లో నవంబర్ 23 నుంచి ఇంగ్లీషులో స్ట్రీమింగ్ కానుంది.

6. లియో
ఈనెల 24 నుంచి తలపతి విజయ్, త్రిష కృష్ణన్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘లియో’ నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

7. ది విలేజ్
అమెజాన్ ప్రైమ్ లో ‘ది విలేజ్’ తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషలో నవంబర్ 24న రానుంది.

8. దూత
అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘దూత’ వెబ్ సిరీస్ ఎట్టకేలకు డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అక్కినేని నాగచైతన్య నటించిన ఈ వెబ్ సిరీస్ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. పలు వాయిదాల తరువాత చివరకు ‘దూత’ వెబ్ సిరీస్ ఎట్టకేలకు డిసెంబరు ఒకటి నుంచి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అయింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు