లెహరాయి ఫస్ట్ సాంగ్ రిలీజ్

రామకృష్ణ పరమహంస ద‌ర్శ‌కుడి గా ప‌రిచ‌యం చేస్తూ మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం “లెహరాయి”. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. రంజిత్, సౌమ్య మీనన్ హీరో, హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని బెక్కం వేణుగోపాల్‌ సమర్పణలో మద్దిరెడ్డి శ్రీనివాస్‌ నిర్మిస్తున్నాడు. అలాగే ధర్మపురి ఫేం గగన్ విహారి తో పాటు రావు రమేష్, సీనియర్ నరేష్,అలీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ “గుప్పెడంత గుండెల్లోన వుంటావే..దాని చ‌ప్పుడేమొ విన‌నంటావే” ను టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. క్యాచి లిరిక్స్, మంచి ట్యూన్ తో ఈ ఫస్ట్ సింగిల్ బాగుందని కారీకేయ అన్నాడు. సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

కాగ “నువ్వు ఏడికొస్తే ఆడికెల్తా సువ‌ర్ణ నీ ఇంటి పేరు మారుస్తా సువ‌ర్ణ..” వంటి హిట్ సాంగ్ కు మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ, ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు