Lal Singh Chaddha : టాలీవుడ్ స్టార్ల కోసం ప్రివ్యూ

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ‘ఫారెస్ట్ గంప్’ అనే అమెరికన్ కామెడీ డ్రామాకు రీమేక్ చిత్రమిది. పుట్టినప్పటి నుండి అంగవైకల్యం తో బాధపడే ఓ పిల్లాడు, తన తల్లి నుండి పొందిన ప్రోత్సాహంతో జీవితంలో అత్యున్నత స్థాయికి ఎలా చేరుకున్నాడు. రాష్ట్రపతి పతకం అందుకునేంతలా ఏం సాధించాడు. అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య కూడా ఓ స్పెషల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.

కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకుడు. ‘అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్’ ‘వయాకామ్ 18 స్టూడియోస్’ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది స్టార్ల హీరోలకు ‘లాల్ సింగ్ చద్దా’ ను స్పెషల్ ప్రివ్యూ వేసి చూపించాడు ఆమిర్ ఖాన్.

టాలీవుడ్ లో అమీర్ ఖాన్ కు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున లతో మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ఈ సాన్నిహిత్యంతో వీరికి లాల్ సింగ్ చద్దా ప్రివ్యూ వేసి చూపించాడు. ఈ ప్రివ్యూకు రాజమౌళి, సుకుమార్ లను కూడా ఆహ్వానించాడు. ‘బాహుబలి’ ‘పుష్ప’ సినిమాలతో బాలీవుడ్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేశారు రాజమౌళి, సుకుమార్. వీళ్లకు స్పెషల్ షో వేసి వారి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నది ఆమిర్ ఖాన్ ప్రయత్నం అని తెలుస్తుంది. ఈ ప్రివ్యూ కు నాగ చైతన్య కూడా హాజరయ్యాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు