Guntur Kaaram: “కుర్చీ మడత పెట్టి” సాంగ్ ప్రోమో… న్యూ ఇయర్ మోత మామూలుగా ఉండదిక

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ నుంచి తాజాగా అదిరిపోయే మాస్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ తో న్యూ ఇయర్ మోత మోగిపోవడం ఖాయం అనిపిస్తుంది.

మహేష్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం”. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడవసారి వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గురువారం రోజు ఈ మూవీలోని చివరి పాట షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ మూవీలోని మాస్ సాంగ్ “కుర్చీ మడత పెట్టి” ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.

ఈ ప్రోమోలో మహేష్ బాబుతో కలిసి హీరోయిన్ శ్రీలీల వేసిన మాస్ స్టెప్పులు అదరగొడుతున్నాయి. ఇక ఈ పార్టీ పెప్పి మాస్ సాంగ్ తో ఈసారి న్యూ ఇయర్ మోత మోగిపోవడం పక్కా. ఈ సాంగ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ బాబు మాస్ స్టెప్పులతో ఇరగదీశాడు. “కుర్చీ మడత పెట్టి” సాంగ్ ప్రోమోలో మహేష్ బాబు, శ్రీలీల ఎనర్జిటిక్ డాన్స్ చూస్తే ఎవరికైనా ఊపు రావాల్సిందే. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ మాసివ్ అప్డేట్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఈ పార్టీ ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆతృత మొదలైపోయింది.

- Advertisement -

ఇక ఇటీవల కాలంలోనే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రెండవ సాంగ్ “ఓ మై బేబీ” వివాస్పదమైన విషయం తెలిసిందే. సాంగ్ బాలేదంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగగా, పాపులర్ లిరికల్ రైటర్ రామ జోగయ్య శాస్త్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు, నిర్మాత నాగ వంశీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మహేష్ అభిమానులకు కోపాన్ని తెప్పించాయి. ఒక రెండు రోజులపాటు సోషల్ మీడియాలో “గుంటూరు కారం” మూవీ మేకర్స్ అభిమానుల మధ్య యుద్ధమే జరిగింది.

అయితే నాగ వంశీ సినిమా గురించి తమకే వదిలేయ్యాలని, థియేటర్లలో మాత్రం కలుసుకుందామని, మాస్ అమ్మ మొగుడు “గుంటూరు కారం” మూవీని థియేటర్లలో వీక్షించడానికి రెడీగా ఉండండి అంటూ ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక తాజాగా విడుదలైన సాంగ్ ప్రోమో చూస్తుంటే నాగ వంశికి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పే లేదనిపిస్తోంది. ఇక ఈ సాంగ్ లో మహేష్ ఎనర్జీ చూస్తుంటే “గుంటూరు కారం”తో పక్కా సంక్రాంతి మూవీగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని, మిగతా అన్ని సినిమాలను తొక్కేసేలాగే కనిపిస్తున్నాడు. “గుంటూరు కారం” మూవీ ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు