Krithi Shetty : ట్రెండీ లుక్ లో కృతి

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొత్త డైరెక్టర్ ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ఇటీవలే హీరో నితిన్ రెడ్డి తన డబ్బింగ్ పనులను కూడా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదల అయిన పాటలు, పోస్టర్లు భారీ అంచనాలను నమోదు చేశాయి.

తాజా గా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ కృతి శెట్టి లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. చేతిలో కప్ పట్టుకుని, కళ్ల జోడు పెట్టుకుని కొంటే చూపుతో అల్లరి చేస్తుంది. ఈ పోస్టర్ లో కృతి శెట్టి ట్రెండీ లుక్ లో కనిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో స్వాతి అనే పాత్రలో కృతి శెట్టి కనిపిస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.

కృతి శెట్టి ఈ మధ్య కాలంలో కెరీర్ పరంగా దూసుకెళ్తుంది. వరుసగా సినిమాలను లైనప్ చేస్తుంది. మిడ్ రేంజ్ హీరోలకు ఒక ఆప్షన్ గా కృతి శెట్టి ఉంటుంది. ఈ భామ నటించిన ది వారియర్ సినిమా ఇటీవల రిలీజ్ అయింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా, కృతి శెట్టి పాత్రకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మాచర్ల నియోజక వర్గం సినిమాలో స్వాతి పాత్రలో కృతి శెట్టి అదరగొట్టే అవకాశం ఉంది. ఈ సినిమా హిట్ అయితే, కృతి శెట్టికి మరిన్నీ అవకాశాలు వస్తాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు