Krithi Shetty: వరుస అవకాశాలు

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి.
మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న కృతి వరుస సినిమాలను లైన్ లో పెట్టింది. ఉప్పెన సినిమా తరువాత చేసిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలు ఊహించిన విజయాన్ని ఇవ్వలేదు. కానీ కృతిశెట్టి కి అవకాశాలు తగ్గలేదు.

ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా చేసిన “వారియర్” సినిమాలో నటించింది కృతి. వారియర్ జులై 14న రిలీజ్ కానుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు  హీరోగా నటిస్తున్న “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అలానే నితిన్ హీరోగా చేస్తున్న “మాచర్ల నియోజకవర్గం” సినిమాల్లో నటిస్తుంది కృతి.

కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా సినిమాలు చేస్తుంది. వారియర్ సినిమా తమిళ్ లో కూడా రిలీజ్ కానుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య చేయబోయే సినిమాలోను, అలానే యాక్షన్ హీరో విశాల్ హీరోగా రానున్న కొత్త తమిళ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి వరుస అవకాశాలతో కృతి శెట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు