Kollywood: 200 కోట్లు పెట్టి రెండు సినిమాలు హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్

Kollywood: ఒకప్పుడు సినిమా చూడాలంటే కేవలం థియేటర్కు మాత్రమే వెళ్ళాలి. టీవీలు కూడా అరుదుగా ఉండేవి. టీవీలు ఉన్నా కూడా సినిమాలు చాలా తక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు సినిమా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పొచ్చు. థియేటర్లో రిలీజ్ అయిన సినిమా పది రోజులకు దాటగానే ఓటిటిలో దర్శనమిస్తుంది. ఇక థియేటర్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోతుంది. కొన్ని సినిమాలు పది రోజులు ముందే ఓటిటిలో రిలీజ్ అయిపోతాయి. ఓటిటి సంస్థలు కూడా కొన్ని కోట్లు ఖర్చుపెట్టి సినిమా రైట్స్ ను కొంటూ ఉంటాయి.

తలపతి విజయ్ సినిమా

తలపతి విజయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. స్నేహితుడు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత విజయ్ చేసిన కొన్ని సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలను కూడా తెలుగు ఆడియన్స్ ఆదరించారు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో విజయ్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది. తెలుగులో లియో సినిమాకి ఇక్కడ మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోట్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

Leo actor Thalapathy Vijay

- Advertisement -

అజిత్ సినిమా

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కేవలం తెలుగు స్టార్ హీరోలతోనే కాకుండా, తమిళ్ స్టార్ హీరోలను కూడా లైన్లో పెట్టింది. ప్రస్తుతం అజిత్ తో గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమాను చేస్తుంది ఈ ప్రొడక్షన్ హౌస్. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అజిత్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అజిత్ తమిళ్ లో చేసిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యాయి. వాటిని కూడా చాలా మంది ప్రేక్షకులు ఆదరించారు.

భారీ రేటు కు కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్

వెంకట ప్రభు దర్శకత్వంలో తలపతి విజయ్ నటిస్తున్న గోట్ సినిమాను డిజిటల్ రైట్స్ ను 115 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ సంస్థ కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలానే అజిత్ సినిమాను దాదాపు 95 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటి గురించి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈ రెండు సినిమాల కోసం దాదాపు 200 కోట్లు వెచ్చించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు