Akshat Rajan : అప్పుడు అక్క.. ఇప్పుడు చెల్లి

నటీ నటులు రిలేషన్ షిప్ లో ఉండటం ప్రస్తుత రోజుల్లో కామన్. బాలీవుడ్ అయితే వెరీ కామన్. బీ టౌన్ లో నటీ నటులు లవ్ లో ఉన్నారని వార్తలు వస్తాయి. నిజానికి అలాంటి ఘటనలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. బాలీవుడ్ అగ్ర తారాల కుటుంబం నుంచి వచ్చే కిడ్స్ లవ్ ట్రాక్ కు సంబంధించిన వార్తలు రెగ్యూలర్ గా వినిపిస్తాయి. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి రాకముందు ఇలాంటి వార్తలే వచ్చాయి.

ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా రిలీజ్ సమయంలో అక్షత్ రంజన్ తో కలిసి జాన్వీ కపూర్ కనిపించింది. తర్వాత కూడా వీరు పార్టీలు, పబ్ లు తిరిగారు అంటూ బాలీవుడ్ మీడియా వార్తలను ప్రచురించింది. అయితే కొన్ని రోజులకు ఈ జంట మళ్లీ ఎక్కడా కనిపించలేదు. జాన్వీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం, బీ టౌన్ లో బిజీగా ఉండటం జరిగింది. అక్షత్ రంజన్ పేరు కూడా ఎక్కడా మళ్లి వినిపించలేదు. ప్రస్తుతం అక్షత్ రంజన్ బీ టౌన్ లో టాక్ ఆఫ్ టౌన్ గా మారింది.

ఇప్పుడు కూడా ఈ కపూర్ ఫ్యామిలీ ద్వారానే అక్షత్ రంజన్ వార్తల్లో నిలుస్తున్నాడు. దీనికి కారణం లేకపోలేదు. జాన్వీ కపూర్ చెల్లెలు ఖూషి కపూర్ సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో ఖూషి కపూర్ ఒక్కరే ఉంటే వార్త కాదు. కానీ, పక్కన అక్షత్ రంజన్ ఉన్నాడు. ఉంటే ఏమిటి. అక్క బాయ్ ఫ్రెండ్ తో ఫోటో అనుకుంటే ఇంత హల్చల్ అయ్యేది కాదు. ఇక్కడ ఒకరికొకరు ఐ లవ్ యూ అని అర్థం వచ్చేలా చాట్ చేసుకున్నారు. అందుకే ప్రస్తుతం అక్షత్ రంజన్, ఖూషి కపూర్ వార్తల్లో నిలిచారు.

- Advertisement -

ఖూషి కపూర్ షేర్ చేసిన ఫోటోకు అక్షత్ రంజన్ ly అని మెసేజ్ చేశాడు. అక్కడితో అయిపోలేదు. ఖూషి కపూర్ ilu అంటూ రిప్లే ఇచ్చింది. ly అంటే ఐ లవ్ యూ అని, ilu అంటే ఐ లవ్ యూ టూ అని అర్థం వస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీంతో ఇంత బహిరంగంగా ఐ లవ్ యూ అని చెప్పుకుంటున్నారంటే వీళ్ల ప్రేమ గాఢత ఎక్కువే ఉంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే అక్షత్ రంజన్ అదృష్ట వంతుడని, అప్పుడు అక్క.. ఇప్పుడు చెల్లితో ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ మెసేజ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు