Sardar : దొంగిలించింది ఎవరు ?

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. ఇందులో కార్తికి జంటగా రాశిఖన్నా,  రజిషా విజయన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోెస్టర్లు, టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. సర్దార్ ను పట్టుకోవడం అంత ఈజీ కాదు అనే డైలాగ్ తో ప్రారంభం అయింది. 

ఇందులో కార్తీ డబుల్ రోల్ చేస్తున్నట్టు కనిపించాడు. స్పై సర్దార్, ఇన్ స్పెక్టర్ విజయ్ ప్రకాశ్ గా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. విజయ్ కి సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమంటే చాలా ఇష్టం. ఈ తరుణంలోనే  “ఆంధ్రా యూనివర్సిటీలో  ఒక ముఖ్యమైన ఫైల్ మిస్ అయిందట. అందులో పాత రహస్యాలు ఉంటాయి. దానిని పట్టుకుంటే నేషనల్ ట్రెండింగ్ అయిపోతావు” అంటూ ట్రైలర్ లో వినిపించిన డైలాగ్ ఈ చిత్ర కథా నేపథ్యాన్ని తెలియజేస్తుంది. 

ఈ తరుణంలోనే విజయ్ ఎదుర్కున్న సమస్యలు ఏంటి ? అతనికి సర్దార్ కి ఉన్న సంబంధం ఏంటి స్పై సర్దార్ జైలులో ఎందుకు ఉండాల్సి వచ్చింది. ఆ మిలటరీ పత్రాలను దొంగిలించింది ఎవరు ? అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూస్తేనే అర్థమవుతోంది. సర్దార్ గా ముసలి స్పై పాత్రలో, యంగ్ పోలీస్ ఆఫీసర్ గా కార్తీ వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు దర్శకుడు. మొత్తానికి ట్రైలర్ తోనే ఈ చిత్రం పై భారీ అంచనాలను పెంచేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న సర్దార్ విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో అప్పటివరకు వేచి చూద్దాం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు