నిఖిల్ సిద్ధార్థ్ , స్వాతి హీరో హీరోయిన్లుగా 2014లో వచ్చిన చిత్రం కార్తికేయ. చందు మొండేటి దర్శకత్వం వహించిన “కార్తికేయ” సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తీకేయ 2 రాబోతోంది. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కార్తికేయ-2 సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.
తన చివరి చిత్రం ‘అర్జున్ సురవరం’ తరువాత దాదాపు 3 ఏళ్లు బ్రేక్ తీసుకున్న నిఖిల్, ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు అందులో ‘కార్తికేయ-2’ ఒకటి. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు మూవీ యూనిట్.
ఇక జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాను వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన సినిమా “థాంక్యూ”.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీ జులై 22న రిలీజ్ కానున్న తరుణంలో కార్తికేయ-2 సినిమాను ఆగష్టు లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది.