Karthikeya-2, Bimbisara,Sita Ramam: తగ్గేదెవరు ?

ఆగస్ట్ 5న మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
వీటిలో రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించారు. కార్తికేయ 2 విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సీతా రామం, బింబిసార, కార్తికేయ 2. ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. ఈ మూడు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయితే బిజినెస్ దెబ్బతింటుంది. ఈ మూడింటిలో బింబిసార మరియు కార్తికేయ 2 ఫాంటసీ చిత్రాలు. రెండు సినిమాలు ఒకే జోనర్‌కి చెందినవి కావడంతో ఓపెనింగ్స్‌పై ప్రభావం పడుతుందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.

వాస్తవానికి కార్తికేయ 2 చిత్రం జులై 22న విడుదల కావాల్సి ఉంది.
కానీ అదే రోజు నాగచైతన్య నటించిన థాంక్యూ చిత్రం విడుదల కావడం వలన కార్తికేయ 2 సినిమాను వాయిదా వేశారు. బింబిసార మరియు కార్తికేయ 2 రెండు చిత్రాల నిర్మాతలతో డిస్ట్రిబ్యూటర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్ద‌రూ విడుద‌ల తేదీని వాయిదా వేయ‌డానికి సిద్ధంగా లేర‌ని వినికిడి.

రవితేజ రామారావు ఆన్ డ్యూటీ జూలై 29న విడుదలవుతోంది. మాచర్ల నియోజకవర్గం, లాల్ సింగ్ చద్దా మరియు కోబ్రా ఆగష్టు 11 మరియు ఆగష్టు 12న విడుదలవుతున్నాయి. కాబట్టి, కార్తికేయ 2 లేదా బింబిసారాను వాయిదా వేయడం కష్టమే అనిపిస్తుంది. అనుకున్న టైం కి ఈ సినిమాలు రిలీజ్ అవుతాయో, లేదంటే ఏ సినిమా వెనక్కు తగ్గుతుందో వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు