సెప్టెంబర్ 30 న కన్నడలో విడుదలైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగా నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ద్వారా రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన మొదటిరోజునుంచే ఈ చిత్రం ఊపందుకుంది. విడుదలైన అన్ని చోట్ల భారీ రెస్పాన్స్ వచ్చింది.
కాంతార చిత్రం విడుదలైన 2 వారాల్లోనే 45 కోట్లు వసూళ్లు సాధించి ఇప్పుడు ఏకంగా 50 కోట్ల వసూళ్లను సాధించింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో హిట్ అవుతుందనేది ఊహాతీతం. కాంతార కేవలం తెలుగులోనే కాకుండా ఇండియా వైడ్ కూడా ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది.
సినిమాకి లాంగ్వేజ్ బారియర్ లేదు సినిమాకి ఎమోషన్ బారియర్ ఒకటే ఉంటుంది అని మెగా నిర్మాత అల్లు అరవింద్ మాటలను కాంతార చిత్రం ప్రూవ్ చేసింది. మొదట కాంతార చిత్రాన్ని చూసిన నిర్మాత బన్నివాసు, అల్లు అరవింద్ గారితో అర్జెంటుగా మీరొక సినిమా చూడండి అంటూ చెప్పడం. ఏంటి బన్ని వాసు ఇంత ఎగ్జైట్మెంట్ చెబుతున్నాడు అని అల్లు అరవింద్ గారు చూడటం. సినిమా ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి దీనిని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అనిపించి ఒక అవకాశంగా తీసుకుని దీనిని తెలుగులో రిలీజ్ చేశామని అల్లు అరవింద్ స్వయంగా చెప్పారు.