Kamal Haasan : ‘భారతీయుడు2’ కి లైన్ క్లియర్ ?

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమ్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ వెర్షన్ పరంగా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు 400 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి కమల్ హాసన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ మూవీకి ముందు కమల్ హాసన్ మార్కెట్ 100 కోట్లకు మించి లేదు. అంతేకాకుండా ‘విక్రమ్’ కంటే ముందు శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ ని మొదలుపెట్టాడు కమల్. కానీ షూటింగ్ స్పాట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. అలాగే, నిర్మాతలకు, దర్శకుడు శంకర్ కు మధ్య బడ్జెట్ విషయంలో మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

ముందుగా ‘భారతీయుడు 2’ కోసం 250 కోట్ల బడ్జెట్ ను కేటాయించారట. దీనిపై లైకా ప్రొడ్యూసర్లు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ, సగం సినిమా పూర్తికాకుండానే 180 కోట్ల బడ్జెట్ పెట్టించాడట దర్శకుడు శంకర్. ఈ కారణం వల్లే శంకర్ కు నిర్మాతలకు మధ్య గొడవలు వచ్చాయని టాక్. తర్వాత కోర్టుకెక్కారు. అటు తర్వాత రాజీ కుదుర్చుకున్నారు. కానీ కమల్ మార్కెట్ దృష్ట్యా అది భారీ బడ్జెట్ సినిమా అవుతుంది. డబ్బులు వెనక్కి రావడం కష్టమని భావించి, ఈ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టారట. కానీ ‘విక్రమ్’ సినిమా 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడంతో వారికి ధైర్యం వచ్చినట్లు తెలుస్తుంది. రాంచరణ్-శంకర్ ల సినిమా పూర్తయిన వెంటనే ‘భారతీయుడు 2’ సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే కమల్ ను నమ్మి బడ్జెట్ ను పెంచే అవకాశం కూడా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు