Kajal Aggarwal: రీ ఎంట్రీ

లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చినా కాజల్ అగర్వల్ మెగాస్టార్,పవర్ స్టార్,మెగా పవర్ స్టార్,స్టైలిష్ స్టార్ లాంటి మెగా హీరోలతోనే కాకుండా మహేష్ బాబు,ఎన్టీఆర్,ప్రభాస్ లాంటి స్టార్ హీరోస్ తో కూడా వర్క్ చేసి మంచి హిట్ సినిమాలు సాధించింది.

మంచు విష్ణు హీరోగా నటించిన మోసగాళ్లు సినిమాలో చివరిసారిగా కనిపించింది కాజల్. ప్రస్తుతం కాజల్ మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఆమె ఇటీవలే తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, కాజల్ తన టాలీవుడ్‌ రీ ఎంట్రీ ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తోందని వినికిడి. ఈ సమయంలో ఆమె కొత్త ప్రాజెక్ట్‌లు ఏవీ సంతకం చేయడం లేదు.

కానీ కాజల్ సరైన స్క్రిప్ట్‌లు దొరికితే వచ్చే ఏడాదిలోగా నటిగా తిరిగి రావాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.కాజల్ ఇకమీదట మూసధోరణి హీరోయిన్ పాత్రలను కాకుండా, లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

పెళ్లి చేసుకుని ఒక ఇంటికి పరిమితం అయినా కూడా కాజల్ కి ఉన్న ఫ్యాన్ బేస్ అయితే తగ్గలేదు, కాజల్ రీ ఎంట్రీ ఇస్తే అది అభిమానులకి ఆనందం కలిగించే విషయమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు