Kahaani: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్ల లాభం.. ఓటీటీ లో ప్రతీక్షణం ఉత్కంఠ..!

Kahaani.. సాధారణంగా కొన్ని కథలు ప్రేక్షకులను ఎంతలా మెప్పిస్తాయి అంటే ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటాయి. అంతేకాదు తక్కువ బడ్జెట్ తో వచ్చి రూ.వందల కోట్లు కలెక్ట్ చేస్తూ రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి.. అయితే ఇక్కడ ఒక చిత్రం మాత్రం ప్రతిక్షణం ఉత్కంఠ రేపుతూ క్లైమాక్స్ లో ఊహించని ట్విస్టులతో ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కథ ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది. కేవలం రూ.8 కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తే బాక్సాఫీస్ వద్ద రూ .100 కోట్లకు పైగా వసూలు సాధించి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో హీరో లేకుండా వచ్చి బంపర్ హిట్ అయింది ఈ సినిమా.. మరి ఈ సినిమా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కహాని సినిమా కథ..
2012లో మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో కోల్కతా నేపథ్యంలో సాగుతుంది. అక్కడి మెట్రో కంపార్ట్మెంట్లో విషవాయువు కారణంగా ప్రయాణికులు భయాందోళనలకు గురవుతారు.. ఈ అంశాన్ని కీలకంగా చేసుకొని సినిమాని తెరకెక్కించారు.. ఇందులో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించగా పరంబ్రత ఛటర్జీ , నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలలో నటించారు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ కథ పూర్తిగా ఒక గర్భిణీ స్త్రీ చుట్టూ తిరుగుతుంది .తప్పిపోయిన తన భర్తను వెతకడానికి విద్య దుర్గా పూజ పండుగ సందర్భంగా కోల్కతాకు వస్తుంది.. తప్పిపోయిన ఈమె భర్తకు మిలన్ జి అనే పరారీలో ఉన్న వ్యక్తితో సంబంధాలు ఉంటాయి. అసలు విద్యాబాలన్ భర్త ఎవరు? ఎలా చివరికి ఆమె తన భర్తను కనిపెట్టింది? అనేది స్టోరీ.

అనుక్షణం ఉత్కంఠ భరితం..
అనుక్షణం ఉత్కంఠ భరితంగా సాగే ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ సినిమా దర్శకత్వం, రచన సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్తాయి.. అంతే కాదు ఈ సినిమాకు వసూళ్ళ తో పాటు మూడు నేషనల్ అవార్డ్స్ కూడా లభించడం గమనార్హం. కేవలం రూ.8కోట్ల బడ్జెట్తో ప్రపంచవ్యాప్తంగా రూ.104 కోట్లు వసూలు చేసి అదరహో అనిపించి.. థియేటర్లలో రూ.50 రోజులకు పైగా నడిచింది.. అంతే కాదు ఇండియన్ సినిమాలలో అత్యుత్తమ థ్రిల్లర్ మూవీలలో ఇది కూడా ఒకటిగా నిలిచింది .ప్రస్తుతం జియో సినిమాలో అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా.

- Advertisement -

శేఖర్ కమ్ముల ప్రయోగం..
అయితే ఈ సినిమాని తెలుగులో ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల అనామిక అనే పేరుతో రీమేక్ చేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు.. ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. వాస్తవానికి శేఖర్ కమ్ముల అంటే కేవలం కాలేజ్ బ్యాక్ డ్రాప్ , స్టూడెంట్స్ మధ్య లవ్ వంటి కథలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాడు. అలాంటి ఈయన ఒక్కసారిగా థ్రిల్లర్ జానెర్ ను తెరకెక్కించే ప్రయత్నం చేయడంలో ఇక్కడ విఫలమయ్యారనే చెప్పాలి.. ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.. దీంతో డిజాస్టర్ గా నిలిచింది.. అసలు శేఖర్ కమ్ముల కూడా ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా అనామిక సినిమా కంటే కహానీ చిత్రం మాత్రం ఇప్పుడు ఓటీటీ లో భారీ రెస్పాన్స్తో దూసుకుపోతోంది.. థ్రిల్లర్ జానర్ లో సినిమా కోసం ఎదురు చూసేవారు ఈ సినిమాను మిస్ అవ్వకండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు