Hidimbha: నందితశ్వేత బ్రేకప్ స్టోరీ వైరల్

హీరోయిన్ నందిత శ్వేతా బ్రేకప్ స్టోరీ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఇటీవలనే ఆమె హీరోయిన్ గా నటించిన హిడింబ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్టూడెంట్స్ మీట్ లో ఆమె తన మొదటి బ్రేకప్ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం అవన్నీ నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.

నిజానికి నందిత శ్వేతా పేరుకు కన్నడ నటి, అయిన కూడా తెలుగు చక్కగా నేర్చుకుంది. ఇప్పటి వరకు ఆమె చేసింది తక్కువ సినిమాలే అయిన ప్రేక్షకుల్లో మాత్రం ఈ హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిఖిల్ హీరోగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హిబింబ సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. అనిల్ కన్నెగంటి ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ టీం ఇటీవలనే ఒక స్టూడెంట్ మీరు నిర్వహించగ అందులో ఒక స్టూడెంట్ మీ హప్పియెస్ట్ మూమెంట్ ఏంటి అని నందితను అడగగా ఆ ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ తన బ్రేకప్ స్టోరీ చెప్పుకొచ్చింది.

- Advertisement -

తన కాలేజీ చేసే సమయం ఒక అబ్బాయిని డీప్ గా లవ్ చేసిందట, ఆ తరువాత కొన్ని కారణాల వల్ల అతనితో బ్రేకప్ అయిందట, అయితే ఈ బ్రేకప్ నందితను విపరీతంగా బాధించిందట, ఏమి తినకుండా, రోజు బాధపడుతూ కూర్చునేదట, అప్పుడే ఆమెకు ఒక కన్నడ సినిమాలో అవకాశం రావడంతో ఆ అబ్బాయిని మర్చిపోవడానికి ఆమె సినిమాకు ఒకే చెప్పిందట. ఇక సినిమాలో అందంగా కనబడాలని మళ్ళీ మంచిగా ఫుడ్ తిండటం, నార్మల్ లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేయగా మొదటి రోజు ఈ సినిమా సెట్ లో అడుగుపెట్టి డైలాగ్ చెప్పేయగానే అందరు క్లాప్స్ కొట్టడంతో తనకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చి, బ్రేకప్ బాధ అంత మర్చిపోయిందట. తన లైఫ్ లో అదే హప్పియెస్ట్ మూమెంట్ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇక ఆమె నటించిన హిడింబ సినిమా విషయానికొస్తే ఇటీవలనే రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా, సినిమాపై నమ్మకంతో రిలీజ్ కు ముందే ప్రీమియర్ షోలు వేశారు. ఆ షో లకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై యూనిట్ అంత నమ్మకంగా ఉన్నారు. జులై 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు