Sandeep Reddy Vanga : సందీప్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్… ప్రమాదం అంటున్న పూనమ్ 

మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా “యానిమల్” సినిమాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తాజాగా ఈ డైరెక్టర్ అదే సినిమాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడం పట్ల హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసింది. స్త్రీద్వేషి అని అర్థం వచ్చే విధంగా ఒక కొత్త పదాన్ని ఉపయోగించి మరీ ఆయనకు అవార్డు రావడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. ఇంతకీ డైరెక్టర్ సందీప్ పై పూనమ్ కౌర్ చేసిన కామెంట్స్ ఏంటి? అంటే….

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన “యానిమల్” మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 900 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ మూవీపై విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి. అయితే ఆ విమర్శలకు అతీతంగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. ముఖ్యంగా బాలీవుడ్ లోని ఓ వర్గం వారు సందీప్ రెడ్డి వంగాను ఇప్పటిదాకా టార్గెట్ చేస్తే, రీసెంట్ గా ఈ మూవీ ఓటిటిలో వచ్చిన తర్వాత సౌత్ నుంచి కూడా కొంతమంది సినీ ప్రముఖులు ఈ డైరెక్టర్ పై మండిపడ్డారు.

తాజాగా ఆ లిస్ట్ లో పూనమ్ కౌర్ కూడా చేరింది. సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు అవార్డు రావడం పట్ల హీరోయిన్ పూనమ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. “మిసోజినికి అవార్డు వచ్చిందని విన్నాను. దీనిపై యానిమల్స్ మాత్రమే నిర్ణయం తీసుకోగలవు. ఇది ప్రమాదానికి సంకేతం” అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పూనమ్ కౌర్ పోస్ట్ చేసింది. మిసోజిని అంటే మహిళల పట్ల ద్వేషం వ్యక్తం చేసే వ్యక్తి అని అర్థం. ఈ పోస్ట్ ద్వారా డైరెక్టర్ సందీప్ కు అవార్డు ఇచ్చిన వారిని జంతువులతో పోల్చింది పూనమ్.

- Advertisement -

దీంతో సందీప్ రెడ్డి వంగా ఫ్యాన్స్ పూనమ్ కౌర్ పై మండిపడుతున్నారు. ఈ బ్యూటీ టైం చూసుకుని మరీ గురూజీ అంటూ ఇన్ డైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని టార్గెట్ చేస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సందీప్ పై ఆమె కామెంట్స్ చేయడం చూసి చేతిలో అవకాశాలు లేక అప్పుడప్పుడూ ఇలా సెలబ్రిటీలపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలవడానికి ట్రై చేస్తుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా “యానిమల్” సినిమాకు మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. విమర్శల సంగతి పక్కన పెడితే ఈ మూవీకి ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు