HBD Karan Johar : ఏడాది తర్వాత సినిమా ప్రకటించిన ప్రొడ్యూసర్… బాలీవుడ్‌లో ఇక సంచలనమే .

HBD Karan Johar.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహార్ తాజాగా తన 52వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.. ఈ నేపథ్యంలోనే తన కొత్త సినిమాని కూడా ఆయన ప్రకటించడం జరిగింది.. ఏడాది తర్వాత డైరెక్టర్ గా తన ఎనిమిదవ ఫీచర్ ఫిలిమ్ ని ప్రకటించారు కరణ్ జోహార్.. తాజాగా తన బర్తడే సందర్భంగా సోషల్ మీడియా హ్యాండిల్‌ లో బౌండ్ స్క్రిప్ట్‌తో పోజులిచ్చి, “గెట్… సెట్.. గో… అనే క్యాప్షన్‌ కు లవ్ సింబల్ ఏమోజిని షేర్ చేశాడు.. ఈయన తన సినిమా టైటిల్ ను ప్రకటించినప్పటికీ బౌన్డ్ స్క్రిప్ట్ పై ఈరోజు తేదీ (25 మే 2024) తో పాటు తన పేరుని కూడా జోడిస్తూ “పేరు లేని కథనం డ్రాఫ్ట్” అంటూ రాశారు. ఇక దీనిని చూపిస్తూ తన డైరెక్షన్లో 8వ ఫీచర్ ఫిలిం రాబోతోంది అంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఈరోజు నుంచి ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రారంభం కానుందని సమాచారం. ఇక తాజాగా షేర్ చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ప్రొడ్యూసర్గా సత్తా చాటుతూ డైరెక్షన్ విభాగంలో కూడా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న కరణ్ జోహార్ ఇప్పుడు తన 8వ ఫీచర్ ఫిలిం ప్రకటించడంతో.. కచ్చితంగా బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తుంది అంటూ అభిమానులు అప్పుడే అంచనాలు వేయడం మొదలుపెట్టారు.. మరి ఈ సినిమా కరణ్ జోహార్ డైరెక్షన్లో ఏ విధంగా రూపు దిద్దుకుంటుందో చూడాలి.

కరణ్ జోహార్ కెరియర్..

కరణ్ జోహార్ విషయానికి వస్తే.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలలో ఈయనకు మంచి పాపులారిటీ ఉంది. దాదాపు బాలీవుడ్ లోనే చాలామంది బడా స్టార్లంతా కరణ్ కి మంచి స్నేహితులే.. ఆయన మాట తీరు , స్టైల్ చూసి చాలా మంది ఆయనను విమర్శించినా.. ఆయనను ఫ్యాషన్ ఐకాన్ లాగా భావించే ప్రేక్షకులు కూడా ఉన్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఎన్నో మర్చిపోలేని హిట్స్ ఇచ్చిన ఈయన దర్శకుడిగా ప్రేమ కథలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు…

దర్శకుడిగా ప్రయాణం..

HBD Karan Johar: The producer who announced the film after a year... is now a sensation in Bollywood.
HBD Karan Johar: The producer who announced the film after a year… is now a sensation in Bollywood.

అలా 1998లో కుచ్ కుచ్ హోతా హై అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమై తన కెరియర్ను మొదలుపెట్టారు కరణ్ జోహార్.. ఇప్పటికే ఫ్రెండ్స్ టు లవర్స్ జోనర్ సినిమాల్లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది ఈ చిత్రం. ఆ తర్వాత షారుక్ ఖాన్ తో కభీ ఖుషి కభీ ఘమ్, కభి అల్విదా నా కెహ్నా , మై నేమ్ ఈజ్ ఖాన్ లాంటి ఫ్యామిలీ లవ్ స్టోరీ లను తెరకెక్కించారు అందరూ కమర్షియల్ హీరో అని బాలీవుడ్ బాద్షా అని అంటూ ఉంటారు.. కానీ కరణ్ జోహార్ మాత్రం ఆయనలోని లవ్ యాంగిల్ ను బయటపెట్టారు.. షారుక్ ఖాన్ , కాజోల్ జంటకి అంత పాపులారిటీ రావడానికి కారణం కరణ్ అని చెప్పాలి.. అందుకే కరణ్ జోహార్ డైరెక్షన్లో షారుక్ , కాజోల్ మళ్ళీ నటిస్తే చూడాలని ఇప్పటికీ ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరో ఫీచర్ ఫిలిం ప్రకటించిన నేపథ్యంలో ఆయన షారుక్ ఖాన్ తో సినిమా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు.. మరి ఆయన దర్శకత్వంలో నటించే వారెవరో మరికొన్ని రోజుల్లో తెలియనుంది.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు