Harish Shankar : ఓపిక నశించిందా ?

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. లక్షలాది మంది ఫ్యాన్స్ లో తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నటీ నటులు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. దర్శకులల్లో, ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ యే గుర్తుకు వస్తారు. తర్వాత, హరీష్ శంకర్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలని కోరుకునే వారిలో హరీష్ శంకర్ ముందు వరుసలో ఉంటాడు. అందుకే, పవన్ కమ్ బ్యాక్ తర్వాత భవదీయుడు భగత్ సింగ్ స్టోరీ వినిపించి, సెట్ చేసుకున్నాడు.

ఈ స్టోరీ పవన్ కు వినిపించి దాదాపు మూడేళ్లు అవుతుంది. కానీ, ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఈ మూడేళ్లలో హరీష్ శంకర్ 25 కోట్ల వరకు నష్టపోయాడని కూడా వార్తలు వచ్చాయి.

ఏది ఏమైనా, పవన్ కళ్యాణ్ పై హరీష్ శంకర్ కు నమ్మకం తగ్గిందట. భవదీయుడు భగత్ సింగ్ ను వదిలి మరో సినిమా చేయాలని హరీష్ నిర్ణయం తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకోసం హీరోలను వెతికే పనిలో ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

అయితే, తాజా గా ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. హరీష్ శంకర్ తన తర్వాత సినిమా కోసం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని సంప్రదించారట. అంతే కాకుండా ఓ స్టోరీని కూడా వినిపించాడని తెలుస్తుంది. స్టోరీ నచ్చడంతో రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
మొత్తంగా మూడేళ్ల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం చేయబోతున్నాడు.

కాగా, రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో RAPO20 చేస్తున్నాడు. దీని తర్వాత హరీష్ శంకర్-రామ్ పోతినేని ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు