Gunturu kaaram : రీజనల్ మూవీస్ లో అల్ టైం రికార్డ్…

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన భారీ సినిమాల్లో గుంటూరు కారం ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాను త్రివిక్రమ్ డైరెక్ట్ చేశాడన్న విషయం తెలిసిందే. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనని రాబట్టుకుంది. అయితే ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే భారీ కలెక్షన్లను సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో రీజనల్ మూవీస్ పరంగా అల్ టైం రికార్డు గుంటూరు కారం క్రియేట్ చేసిందని చెప్పొచ్చు.

ఇక గుంటూరు కారం రిలీజ్ అయిన ఫస్ట్ డే ఏరియా వారీగా కలెక్షన్లను గమనిస్తే…

నైజాం : 16.45Cr, సీడెడ్ : 3.31Cr, ఉత్తరాంధ్ర : 4.05Cr, ఈస్ట్ : 4.01Cr,
వెస్ట్ : 2.60Cr, గుంటూరు : 4.36Cr, కృష్ణ : 2.56Cr, నెల్లూరు : 1.54Cr, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 38.88 కోట్ల షేర్, వసూలు చేయగా, కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 2.55Cr, ఓవర్సీస్ లో 10.60Cr వసూలు చేసింది. ఓవరాల్ గా గుంటూరు కారం వరల్డ్ వైడ్ గా 52.03 కోట్ల షేర్ వసూలు చేయగా 79.30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

- Advertisement -

ఇక మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా రీజనల్ మూవీస్ పరంగా అల్ టైం రికార్డు ఓపెనింగ్స్ సాధించిందని చెప్పొచ్చు. ఇక నైజాం లో గుంటూరు కారం రీజనల్ మూవీస్ లో అల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చుకోగా, పాన్ ఇండియా మూవీస్ అయిన RRR, సలార్ తర్వాత భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అయితే గుంటూరు కారం సినిమాకి దాదాపు 133 కోట్ల కి పైగా బిజినెస్ చేయగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు మరో 80 కోట్ల షేర్ రాబట్టాలి. మరి పండగ అడ్వాంటేజ్ తో గుంటూరు కారం ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు