Guntur Kaaram : థియేటర్లన్నీ రమణ గాడివే… మాస్ స్ట్రాటజీతో ఇతర సినిమాలకు పెద్ద దెబ్బే

Guntur Kaaram : థియేటర్లన్నీ రమణ గాడివే… మాస్ స్ట్రాటజీతో ఇతర సినిమాలకు పెద్ద దెబ్బే సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ రిలీజ్ కు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఇప్పటినుంచే ప్రమోషన్లలో స్పీడ్ పెంచేశారు మేకర్స్. ఎక్కడ చూసినా “గుంటూరు కారం” మేనియానే కనిపిస్తోంది. ఇక ఈ సినిమా హీరో మహేష్ , డైరెక్టర్ త్రివిక్రమ్ కంటే నిర్మాత నాగ వంశీ హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది.

ఇప్పటికే “గుంటూరు కారం” మూవీ రిలీజ్ హంగామా స్టార్ట్ కాగా, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తన మాస్ స్ట్రాటజీతో ఈ మూవీ రిలీజ్ కోసం భారీ ప్లానింగ్ చేస్తూ అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంటున్నాడు. ఈ స్ట్రాటజీతో సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఇతర సినిమాల మేకర్స్ కు దిమాక్ కరాబ్ కావడం ఖాయం.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు “గుంటూరు కారం” మూవీ నైజాం డిస్ట్రిబ్యూషన్ బాధ్యతను చేతుల్లోకి తీసుకున్నారు. మొదటి రోజునే ఈ మూవీ అత్యధిక థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాదులో మొత్తంగా 96 సింగల్ స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అయితే అందులో 90 కి పైగా సింగల్ స్క్రీన్ లలో “గుంటూరు కారం” మూవీనే రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు దిల్ రాజు. ఇక మిగిలిన నాలుగు ఐదు థియేటర్లలో ఆరోజు రాబోతున్న మిగతా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ మాస్ స్ట్రాటజీని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు.

- Advertisement -

అలాగే జనవరి 12న ఉదయం 4 గంటల షోలకు, “సలార్” మూవీతో సమానంగా టికెట్ ధరలను పెంచడానికి అనుమతి కోరుతూ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మేకర్స్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏపీలో టికెట్ ధరలపై ఆంక్షలు విధించడంతో తెలంగాణ నుంచే ఈ మూవీ ఎక్కువ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇంత భారీ స్థాయిలో థియేటర్స్ ను దక్కించుకున్న ఏకైక మూవీ “గుంటూరు కారం” అని తెలుస్తోంది.

జనవరి 12న “గుంటూరు కారం”తో పాటు మరో రెండు మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే జనవరి 13, 14 తేదీల్లో కూడా స్టార్ హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతూ ఉండడంతో, మొదటి రోజే వీలైనన్ని ఎక్కువ కలెక్షన్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక “గుంటూరు కారం” మూవీ ఈ సంక్రాంతికి అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలవుతుండగా, బెనిఫిట్ షోలకు భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది.

అయితే ఎవరూ ఊహించని విధంగా “గుంటూరు కారం” టీం తీసుకున్న ఈ మూవ్ అదే రోజు రిలీజ్ కాబోతున్న ఇతర సినిమాల నిర్మాతలను కలవరపెడుతోంది. ముఖ్యంగా “హనుమాన్” మూవీ కూడా అదే రోజు వస్తూ ఉండడం, కేవలం మూడు నాలుగు సింగిల్ స్క్రీన్ లలో మాత్రమే ఈ మూవీ ప్రదర్శితం అవుతుండడంతో “హనుమాన్”కు పెద్ద దెబ్బ పడినట్టు అయింది. ఇక హైదరాబాదులోని ఇతర థియేటర్లలో “గుంటూరు కారం” ఉదయం నాలుగు గంటల షోలు, “హనుమాన్” రెగ్యులర్ షోలు పడబోతున్నాయి. ఏదేమైనా రమణ గాడు మాసివ్ స్ట్రాటజీ తో “హనుమాన్”ను కోలుకోలేని దెబ్బ కొట్టేశాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు